చిట్వేల్‌కు చెందిన, అనంతరం బెంగళూరులో స్థిరపడిన కార్య లక్ష్మీదేవి మరియు ఆమె కుమారులు మూర్తి, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు తమ తండ్రి, వ్యవసాయశాఖ రిటైర్డ్ AEO అయిన నల్లప్ప గారి వర్ధంతి సందర్భంగా రాపూర్ రోడ్డులోని శ్రీశ్రీశ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధూపదీప సామగ్రి సమకూర్చి, మధ్యాహ్నం అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమానికి ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ గారు ఆశీర్వచనాలు అందిస్తూ, నల్లప్ప గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుమార్తె రమాదేవి, కుమారులు మూర్తి, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, నాగలక్ష్మమ్మ, పద్మావతమ్మ, నిర్వాహకుడు చంద్రశేఖర్ స్నేహితులు ఆత్మారెడ్డి, కోటి, నరసింహులు పాల్గొన్నారు.

నల్లప్ప గారి వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో సానుభూతి కార్యక్రమం