నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ పట్టణం లో వినాయక నవరాత్రుల ముగింపు సందర్బంగా ప్రశాంత వాతావరణం లో శోభయాత్ర ప్రారంభమైనది. రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హనుమాన్ పురం లోని వినాయక విగ్రహానికి పూజాదిక్యాలు నిర్వహించి యాత్రను ప్రారంభిచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా జిల్లా ప్రజలు మత సామరస్యంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, ఈసారి కూడా శాంతియుత వాతావరణం లో జరగాలని సూచించారు.
జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం మొదలుపెట్టమని, ఘాట్ రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భక్తులు క్రమ శిక్షణతో నిమజ్జనంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవ కమీటీలు ప్రజలు సహకరించడంతో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది.

నల్గొండ లో వినాయక నిమజ్జన శోభయాత్ర
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ పట్టణం లో వినాయక నవరాత్రుల ముగింపు సందర్బంగా ప్రశాంత వాతావరణం లో శోభయాత్ర ప్రారంభమైనది. రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హనుమాన్ పురం లోని వినాయక విగ్రహానికి పూజాదిక్యాలు నిర్వహించి యాత్రను ప్రారంభిచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా జిల్లా ప్రజలు మత సామరస్యంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, ఈసారి కూడా శాంతియుత వాతావరణం లో జరగాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం మొదలుపెట్టమని, ఘాట్ రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భక్తులు క్రమ శిక్షణతో నిమజ్జనంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవ కమీటీలు ప్రజలు సహకరించడంతో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది.

