డిసెంబర్ 27 నుండి 30 వరకు పోటీలు
బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ
కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ, పున్నమి ప్రతినిది:ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ తెలియజేశారు.గురువారం యూనివర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సహకారంతో నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ పోటీలుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వేదిక అవుతుందన్నారు.డిసెంబర్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించామన్నారు. దేశం నలుమూలల నుండి బెస్ట్ ఫిజిక్ పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని, పోటీలలో పాల్గొనే క్రీడాకారులు డిసెంబర్ 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రతిభవంతులైన క్రీడాకారులకు నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందని,విశ్వవిద్యాలయం ప్రతిష్టను పెంచే ఈ జాతీయ స్థాయి పోటీలను సమష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ ఆచార్య కె.వి.స్వామి, అసోసియేట్ సెక్రటరీ డా.ఎం.వి.ఎస్.ఎస్.మూర్తి, ప్రిన్సిపాల్స్,విశ్వవిద్యాలయ అధికారులు,ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు పాల్గొన్నారు.


