నడి సెంటర్లో చెత్తకుప్పలతో దుర్వాసన… పంచాయతీ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.
నల్లజర్ల గ్రామంలో మూడు రోడ్ల కూడలిలో గుడ్ మార్నింగ్ హోటల్ ముందు రోడ్డుపై పేరుకుపోయిన చెత్త దుర్వాసన చుట్టూ ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. డబ్బాలు నిండిపోవడంతో నేలపైకి చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఉంటూ అక్కడే తినే వారు భయంకరమైన వాతావరణంలో ఉన్నారు. పంచాయతీ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే శుభ్రత చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

