Tuesday, 24 March 2026
  • Home  
  • నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు
- విశాఖపట్నం

నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు

నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు * ఉచిత ప్రవేశం కల్పించిన చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి ప్రశంసలు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* నాగులచవితి సందర్భంగా నగరంలోని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ లు నగరవాసులతో కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనసందోహం తో పార్కుల్లో సందడి వాతావరణం కనిపించింది. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వచ్చే కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా వి ఎం ఆర్ డి ఎ కి చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించినట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రకటించారు. దీంతో విశాఖ చుట్టుపక్కల సమీప ప్రాంతాల ప్రజలు కైలాసగిరి, తెన్నేటి పార్కు, బీచ్ రోడ్డులో ఉన్న వుడా పార్కు, సెంట్రల్ పార్కుల వద్ద బారులు తీరారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పుట్టల్లో పాలు పోసి, నాగదేవతకు భక్తితో కొలిచి, ప్రసాదాలు పెట్టి, మొక్కులు తీర్చుకున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయా పార్కుల్లో పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారిగా పెద్ద సంఖ్య లో నగరవాసులు పార్కుల వద్ద చేరుకోవటంతో పార్క్ ల పరిసరాల్లో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం పూజలు, బాణసంచా వెలిగించడం, అల్పాహారం తీసుకోవడంతో పాటు మధ్యాహ్నం భోజనాలు (పిక్నిక్) కూడా చేసి ఆనందంగా గడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నాగుల చవితి పురస్కరించుకొని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి నగర వాసులు ప్రశంసించారు. తామెప్పుడూ ఇంతగా ఆనందం గడపలేదని, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సంబరాలు చేసుకోలేదని సందర్శకులు పేర్కొన్నారు. ఇదంతా ఆయా పార్కుల్లో తమకు ఉచిత ప్రవేశం కల్పించడం వలనే అంటూ వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారి సేవల్ని కొనియాడారు. శనివారం నాగుల చవితి పూజలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా పార్కుల్లోసరదాగా గడిపేందుకు అవకాశం కల్పించటం కోసం ఈ ఉచిత ప్రవేశం నిర్ణయం తీసుకున్నామని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు పెద్ద ఎత్తిన ఉపయోగించుకున్నారని తెలిపారు. నగర ప్రజల సంతోషంగా ఆనందంగా గడిపేందుకు వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు
* ఉచిత ప్రవేశం కల్పించిన చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి ప్రశంసలు
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
నాగులచవితి సందర్భంగా నగరంలోని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ లు నగరవాసులతో కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనసందోహం తో పార్కుల్లో సందడి వాతావరణం కనిపించింది. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వచ్చే కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా వి ఎం ఆర్ డి ఎ కి చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించినట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రకటించారు. దీంతో విశాఖ చుట్టుపక్కల సమీప ప్రాంతాల ప్రజలు కైలాసగిరి, తెన్నేటి పార్కు, బీచ్ రోడ్డులో ఉన్న వుడా పార్కు, సెంట్రల్ పార్కుల వద్ద బారులు తీరారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పుట్టల్లో పాలు పోసి, నాగదేవతకు భక్తితో కొలిచి, ప్రసాదాలు పెట్టి, మొక్కులు తీర్చుకున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయా పార్కుల్లో పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారిగా పెద్ద సంఖ్య లో నగరవాసులు పార్కుల వద్ద చేరుకోవటంతో పార్క్ ల పరిసరాల్లో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం పూజలు, బాణసంచా వెలిగించడం, అల్పాహారం తీసుకోవడంతో పాటు మధ్యాహ్నం భోజనాలు (పిక్నిక్) కూడా చేసి ఆనందంగా గడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నాగుల చవితి పురస్కరించుకొని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి నగర వాసులు ప్రశంసించారు. తామెప్పుడూ ఇంతగా ఆనందం గడపలేదని, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సంబరాలు చేసుకోలేదని సందర్శకులు పేర్కొన్నారు. ఇదంతా ఆయా పార్కుల్లో తమకు ఉచిత ప్రవేశం కల్పించడం వలనే అంటూ వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారి సేవల్ని కొనియాడారు. శనివారం నాగుల చవితి పూజలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా పార్కుల్లోసరదాగా గడిపేందుకు అవకాశం కల్పించటం కోసం ఈ ఉచిత ప్రవేశం నిర్ణయం తీసుకున్నామని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు పెద్ద ఎత్తిన ఉపయోగించుకున్నారని తెలిపారు. నగర ప్రజల సంతోషంగా ఆనందంగా గడిపేందుకు వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.