జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ( మార్చి పున్నమి)
బుధవారం జరిగిన నెల్లూరు కార్పోరేషన్ బడ్జెట్ సమావేశమే స్రవంతి కి మేయర్ గా చివరి సమావేశం కానుందనే గుసగుసలు వినిపించాయి.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్పొరేషన్ల లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాలు పెట్టి వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్న తరుణంలో నెల్లూరు కార్పోరేషన్ కూడా అదే బాటలో తమ జెండా కిందకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వచ్చే అక్టోబర్ నాటికి కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సన్నద్ధం చేసుకునేందుకు మార్గం సుగమం అయింది.
కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో బలం చేకూరడంలో
. అదనంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు కూడా ఉండటంతో అవిశ్వాసం ఖాయం అనే ప్రచారం బలంగా ఉంది
. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నాలుగేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలోనే ముందుగానే జిల్లా పాలన అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి కార్పొరేషన్ అధికారులకు అవిశ్వాస తీర్మానం అందజేయాలనే వ్యూహం లో టిడిపి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే అక్టోబర్ కు ముందుగానే అవిశ్వాస తీర్మానం కార్పొరేషన్ లో ఇచ్చి
నాలుగేళ్లు పూర్తి అవ్వగానే వెంటనే సర్వసభ్య సమావేశం తో మేయర్ ను తొలగించి నూతన మేయర్ గా నియమించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు మంత్రి నారాయణ, రూరల్ యమ్ యల్ ఎ శ్రీ ధర్ రెడ్డి చేస్తారని పార్టీ వర్గాల సమాచారం.
రానున్న ఆరు నెలల్లో రాజకీయ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో నూతన మేయర్ ఎంపిక లో ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నది కూడా ఆసక్తి కరమే. సంవత్సర కాలం పదవి విషయంలో ఎలాంటి ఒప్పందాలు నెల్లూరు, నెల్లూరు రూరల్ మధ్య చోటు చేసుకుంటాయి నున్నది కూడా విశేషమే.ఇప్పటికే పలు ” యు” టర్న్ లు తీసుకున్న మేయర్ స్రవంతి మరో టర్న్ అనేది కూడా ఆసక్తి కరమే..
వేచి చూడాల్సిందే
నగర మేయర్ కు ఇదే చివరి సమావేశమా. అవిశ్వాస తీర్మానానికి దేశం ప్రయత్నాలు .??
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ( మార్చి పున్నమి) బుధవారం జరిగిన నెల్లూరు కార్పోరేషన్ బడ్జెట్ సమావేశమే స్రవంతి కి మేయర్ గా చివరి సమావేశం కానుందనే గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్పొరేషన్ల లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాలు పెట్టి వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్న తరుణంలో నెల్లూరు కార్పోరేషన్ కూడా అదే బాటలో తమ జెండా కిందకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే అక్టోబర్ నాటికి కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సన్నద్ధం చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో బలం చేకూరడంలో . అదనంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు కూడా ఉండటంతో అవిశ్వాసం ఖాయం అనే ప్రచారం బలంగా ఉంది . అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నాలుగేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలోనే ముందుగానే జిల్లా పాలన అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి కార్పొరేషన్ అధికారులకు అవిశ్వాస తీర్మానం అందజేయాలనే వ్యూహం లో టిడిపి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే అక్టోబర్ కు ముందుగానే అవిశ్వాస తీర్మానం కార్పొరేషన్ లో ఇచ్చి నాలుగేళ్లు పూర్తి అవ్వగానే వెంటనే సర్వసభ్య సమావేశం తో మేయర్ ను తొలగించి నూతన మేయర్ గా నియమించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు మంత్రి నారాయణ, రూరల్ యమ్ యల్ ఎ శ్రీ ధర్ రెడ్డి చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. రానున్న ఆరు నెలల్లో రాజకీయ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో నూతన మేయర్ ఎంపిక లో ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నది కూడా ఆసక్తి కరమే. సంవత్సర కాలం పదవి విషయంలో ఎలాంటి ఒప్పందాలు నెల్లూరు, నెల్లూరు రూరల్ మధ్య చోటు చేసుకుంటాయి నున్నది కూడా విశేషమే.ఇప్పటికే పలు ” యు” టర్న్ లు తీసుకున్న మేయర్ స్రవంతి మరో టర్న్ అనేది కూడా ఆసక్తి కరమే.. వేచి చూడాల్సిందే