*నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తాం*
*పరిశ్రమల స్థాపనతోపాటు టూరిజంనీ అభివృద్థి చేస్తాం*
*విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై వైసీపీ దుష్ప్రచారం సరికాదు*
*4వ డివిజన్లో రూ.24 లక్షల వ్యయంతో తాగునీటి సరఫరా పైపులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్*
తమ కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరాన్ని పారిశ్రామికంగానే కాకుండా టూరిజంగా కూడా అభివృద్థి చేస్తామని తూర్పు నియోకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. నగరంలోని కనకదుర్గమ్మ గుడిని అభివృద్థి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిదేనని పేర్కొన్నారు.
బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎల్ఐసీ కాలనీలో నెల్సన్ మండేలా పార్కు పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన అక్కడి వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని రూ.24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా పైపులు అమర్చే పనులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ విజయవాడలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చి లక్షలాది మంది భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలుగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2014 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనకదుర్గమ్మ గుడిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి అభివృద్థి చేశారని గుర్తుచేశారు. 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి దుర్గమ్మ గుడిని ఏ విధమైన అభివృద్థి చేశారో ప్రజలే పోల్చి చూసుకోవాలని కోరారు. జగన్మోహన్రెడ్డి దుర్గమ్మ గుడికి వచ్చిన ప్రతిసారి కొండరాళ్ళు విరిగిపడేవని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం దసరా ఉత్సవాలతో పాటుగా విజయవాడ పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా ‘విజయవాడ ఉత్సవ్’ను ఎంతో వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని, రోజుకు రెండు లక్షల ఆదాయం భక్తుల నుంచి కానుకల ద్వారా ఆలయానికి వస్తోందన్నారు. దసరా ఉత్సవాలపై ప్రజలను మభ్యపెట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడం సరికాదని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక శ్రద్ధతో 24 గంటలు దృష్టి పెట్టి దసరా ఉత్సవాలను, ‘విజయవాడ ఉత్సవ్’ను చక్కగా నిర్వహించారని వివరించారు. ఎంపీ కేశినేని శివనాథ్పై వైఎస్సార్సీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలడం సరికాదన్నారు. విజయవాడను టూరిజం పరంగా అభివృద్థి చేయడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుటుందన్నారు. దసరా ఉత్సవాలతో పాటుగా ‘విజయవాడ ఉత్సవ్’ను నిర్వహించామని, గాంధీ హిల్ను కూడా టూరిజంగా అభివృద్థి చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్న విషయాల్లోని అవాస్తవాలను ప్రజలందరూ గ్రహించాలని కోరారు. నగర పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపన ద్వారా ఇక్కడి యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, నగరాన్ని టూరిజంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్థి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంతో పాటుగా డ్రైనేజీ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామన్నారు. ఆ అభివృద్థిలో భాగంగానే ఇప్పుడు 4వ డివిజన్లో రూ.24 లక్షల అంచనా వ్యయంతో తాగునీటి సరఫరా పైపులను అమర్చే పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో వటపట్ల గోపాలకృష్ణ, నందిపాటి దేవానంద్, గద్దె రమేష్, యలమంచలి రాజేష్, దోమకొండ రవి, కొర్రపాటి సురేంధ్ర, యర్నేన్ని వేదవ్యాస్, పి.మహేంద్ర, మల్లిఖార్జునరావు, శేషగిరిరావు, దాసరి గాబ్రియేలు, ధూళిపాళ్ల రమేష్, చలసాని రమణ, షేక్ షరీఫ్, కార్పోరేషన్ ఏఈ దీక్షీత్ తదితరులు పాల్గొన్నారు.


