నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణలు తొలగింపుల కొనసాగింపు
* జీవీఎంసీ పరిధిలో ఆదివారం 319 ఆక్రమణల తొలగింపు .
– జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు
*విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 319 ఆక్రమణలను ఆదివారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడమైనదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగినదని, ఇప్పటికే నగరంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యల దిశగా ఆపరేషన్ లంగ్స్ పనిచేస్తుందన్నారు.
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులులో ఎక్కువగా రోడ్లు, పుట్ పాత్ ఆక్రమణలు మరియు రోడ్ల కిరువైపుల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్లకు అండంకు ఏర్పడడం, తరచుగా ప్రజల రాకపోకలకు, వాహనాల రవాణాకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టే ఆవశ్యకత దృష్ట్యా జి.వి.యం.సి లో గల 8 జోన్ల పరిధిలో గల ప్రధాన రహదారులలో, జంక్షన్లలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని వెంటనే పోలీసు వారి సహకారము తో శనివారం తొలగించిన 336 ఆక్రమణలతో పాటు మొత్తంగా 655 ఆక్రమణలను తొలగించడమైనదని సిసిపి తెలిపారు.
తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది.
1వ జోన్ లోని క్లాక్ టవర్ నుండి తగరపువలస జంక్షన్ వరకు 20 ఆక్రమణలు
జోన్ 2 పరిధిలో ఎండాడ నుండి రుషికొండ 100 అడుగుల రోడ్డు వరకు 60 ఆక్రమణలు,
3వ జోన్ పరిధిలో స్పోర్ట్స్ అరీనా నుండి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ ఎదురు రోడ్డు వరకు, అలాగే మహాలక్ష్మి అపార్ట్మెంట్ నుండి నేషనల్ హైవే శివాజీ పార్క్ రోడ్డు వరకు 42 ఆక్రమణలు,
4 వ జోన్ పరిధిలోని లీలామహల్ జంక్షన్ నుండి సౌత్ జైలు రోడ్డు వరకు 27 ఆక్రమణలు,
5వ జోన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి మర్రిపాలెం జంక్షన్ వరకు 34 ఆక్రమణలు,
6వ జోన్ పరిధిలోని శ్రీనగర్ నుండి దుర్గా నగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు 53 ఆక్రమణలను,
7వ జోన్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం నుండి చింతా వారి వీధి వరకు 18 ఆక్రమణలు,
8వ జోన్ పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం నుండి వేపగుంట వరకు వేపగుంట జంక్షన్ నుండి గోపాలపట్నం జంక్షన్ వరకు అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు వరకు 65 ఆక్రమణలు తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు ,సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

