



మన ఊరు, మన బాధ్యతలో భాగముగా కొంతమంది సేవకులు, వర్షంలోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేటి అన్నప్రసాద దాతలు అరసవల్లికి చెందిన డా.ఇంజరాపు మోహన్ రావు కుమార్తె, ఇంజరాపు.కీర్తన జన్మదినం సందర్భంగా నగరంలో పలు చోట్ల అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థానిక ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం, పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి, డే అండ్ నైట్ కూడలి, నైట్ షెల్టర్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి , పాత బస్ స్టాండ్, ఏడు రోడ్ల కూడలి, కొత్త రోడ్ పరిసర ప్రాంతాలలో నిస్సహాయ పేదలకు ఆహారాన్ని అందించారు. అనంతరం పేదల వైద్యులు ఇంజరాపు.మోహన్ మాట్లాడుతూ సివిల్స్ కి సిద్దమౌతున్న నా కుమార్తె, కీర్తన ఆలోచన మేరకు ఈ రోజు నగరంలో వందమంది ఆకలి తీర్చామని, మన ఊరు, మన బాధ్యతలో భాగముగా సేవా కార్యక్రమాన్ని చేయటం బాధ్యతతోపాటు, పదిమంది కడుపు నింపటం ఆనందంగా ఉందన్నారు.
తుఫాన్ తీవ్రత ఉన్నందున నగరంలో అన్ని ముఖ్య కూడలిలలో ఆహారాన్నందించామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది.ఉమా శంకర్, నేటి దాత ఇంజరపు.మోహన్ మిత్రులు సిరిగిరి.నవచైతన్య, బత్తిలి.రమేష్, కె.నవీన్, సేవకులు ఉర్లం.శివతేజ, షెల్టర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

