Wednesday, 1 April 2026
  • Home  
  • నఖిలి రిపోర్టర్. జగ్గయ్యపేట లో జరిగిన సంఘటన
- క్రైమ్

నఖిలి రిపోర్టర్. జగ్గయ్యపేట లో జరిగిన సంఘటన

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతి నిధి ) న్యూస్ రిపోర్టర్ ముసుగులో మోసాలు – జగ్గయ్యపేటలో చర్చ. జగ్గయ్యపేట పట్టణంలో న్యూస్ రిపోర్టర్‌గా చెబుతూ అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి విషయం బయటకు రావడంతో ప్రజల్లో ఎవర ఫేక్ రిపోర్టర్ అంటూ చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళ్తే — పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తాను న్యూస్ రిపోర్టర్‌ని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. న్యూస్ రిపోర్టర్ పేరుతో ప్రజలను భయపెట్టుతూ, మోసాలకి పాల్పడుతున్నాడు . మళ్ళీ జర్నలిజం మీద పెద్ద పెద్ద లెక్చర్లలు ఇస్తూ తానే పెద్ద నీతిమంతుడుని అని చెప్పుకుంటాడు ఈ క్రమంలో జగ్గయ్యపేటకు చెందిన ఓ మైనార్టీ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగి, ఆమె నమ్మకాన్ని వాడుకుని, ఆమె పేరులో ఉన్న ఆస్తులను తన పేరుమీదకు మార్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలానికి మోసానికి గురయ్యానని గుర్తించిన ఆ మహిళ, జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఆ వ్యక్తి మొదట తప్పుడు సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసుల వాళ్ళ స్టయిల్ లో విచారించగా, తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తర్వాత ఆ మహిళ పేరులో ఉన్న ఆస్తులను తిరిగి ఆమె పేరుమీదకు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ విషయం బయటకు రావడంతో జగ్గయ్యపేటలో చర్చ మొదలైంది. స్థానిక మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి నకిలీ రిపోర్టర్లు జర్నలిజం పేరుతో తిరిగి జర్నలిజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కూడా “ఇలాంటి ఫేక్ రిపోర్టర్లు ఎవరో బయటపెట్టి శిక్షించాలి” అంటూ చర్చించుకుంటున్నారు

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ప్రతి నిధి )

న్యూస్ రిపోర్టర్ ముసుగులో మోసాలు – జగ్గయ్యపేటలో చర్చ.

జగ్గయ్యపేట పట్టణంలో న్యూస్ రిపోర్టర్‌గా చెబుతూ అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి విషయం బయటకు రావడంతో ప్రజల్లో ఎవర ఫేక్ రిపోర్టర్ అంటూ చర్చ మొదలైంది.

వివరాల్లోకి వెళ్తే — పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తాను న్యూస్ రిపోర్టర్‌ని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. న్యూస్ రిపోర్టర్ పేరుతో ప్రజలను భయపెట్టుతూ, మోసాలకి పాల్పడుతున్నాడు . మళ్ళీ జర్నలిజం మీద పెద్ద పెద్ద లెక్చర్లలు ఇస్తూ తానే పెద్ద నీతిమంతుడుని అని చెప్పుకుంటాడు

ఈ క్రమంలో జగ్గయ్యపేటకు చెందిన ఓ మైనార్టీ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగి, ఆమె నమ్మకాన్ని వాడుకుని, ఆమె పేరులో ఉన్న ఆస్తులను తన పేరుమీదకు మార్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

కొంతకాలానికి మోసానికి గురయ్యానని గుర్తించిన ఆ మహిళ, జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు.

విచారణ సమయంలో ఆ వ్యక్తి మొదట తప్పుడు సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసుల వాళ్ళ స్టయిల్ లో విచారించగా, తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు.

తర్వాత ఆ మహిళ పేరులో ఉన్న ఆస్తులను తిరిగి ఆమె పేరుమీదకు ఇవ్వడానికి అంగీకరించాడు.

ఈ విషయం బయటకు రావడంతో జగ్గయ్యపేటలో చర్చ మొదలైంది. స్థానిక మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి నకిలీ రిపోర్టర్లు జర్నలిజం పేరుతో తిరిగి జర్నలిజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజలు కూడా “ఇలాంటి ఫేక్ రిపోర్టర్లు ఎవరో బయటపెట్టి శిక్షించాలి” అంటూ చర్చించుకుంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.