చిట్వేల్ మండలంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ భవాని శంకర స్వామి వారి దేవస్థానం (శివాలయం) లో ఈరోజు పలువురు జర్నలిస్టులు స్వామి వారిని దర్శించుకున్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శివాలయాన్ని సందర్శించిన మీడియా ప్రతినిధులకు ఆలయ కమిటీ తరపున స్వాగతం లభించింది.
జర్నలిస్టులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో కొంత సమయం గడిపిన జర్నలిస్టులు, ఆలయ అభివృద్ధి, కార్తీక మాసంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు.
-సన్మానం కార్యక్రమం
ఆలయ దర్శనం అనంతరం జర్నలిస్టులందరికీ ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రముఖుడు మద్దిన చంద్రమోహన్ నాయుడు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో నిరంతరం కష్టపడుతూ, ప్రజలకు సత్యాలను తెలియజేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని చంద్రమోహన్ నాయుడు అన్నారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీడియా మిత్రులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం జర్నలిస్టులందరికీ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదమును మద్దిన చంద్రమోహన్ నాయుడు స్వయంగా అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


