అమలాపురం, అక్టోబరు 13 (పున్నమి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమ లాగా తయారుచేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విధివిధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం మాజీ అమూడా చైర్మన్ & అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిఐ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎక్సైజ్ సిఐ కు రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న నకిలీ మద్యం విక్రయాల గురించి అలాగే బెల్ట్ షాపుల గురించి ముఖ్య నాయకులు క్లుప్తంగా వివరించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి* వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్