Wednesday, 4 February 2026
  • Home  
  • నకిలీ నోట్ల ముఠా పట్టివేత
- ఆంధ్రప్రదేశ్

నకిలీ నోట్ల ముఠా పట్టివేత

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సంగముడి గ్రామంలోని హెప్సీ వైన్ షాప్‌లో ఇద్దరు వ్యక్తులు రెండు నకిలీ 500 రూపాయల నోట్లు ఇవ్వడం తో తో అనుమానం వచ్చిన క్యాషియర్ ఫిర్యాదు చేయడం తో కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ఎస్‌డీపీఓ సీహెచ్. రాజా పర్యవేక్షణలో పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు విశాఖ పెందుర్తి మండలం కోకవానిపాలెంలో అద్దె ఇంట్లో నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తునట్లు పోలీసులు తెలిపారు. రూ.6.02 లక్షల నకిలీ నోట్లు, రూ.6 వేల ఒరిజినల్ నగదు, 3 సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, ల్యామినేషన్ మెషిన్ తదితర పరికరాలను సీజ్ చేసి నిందితులను బంటుమిల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. నకిలీ నోట్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. Uploaded Video:

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సంగముడి గ్రామంలోని హెప్సీ వైన్ షాప్‌లో ఇద్దరు వ్యక్తులు రెండు నకిలీ 500 రూపాయల నోట్లు ఇవ్వడం తో తో అనుమానం వచ్చిన క్యాషియర్ ఫిర్యాదు చేయడం తో కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ఎస్‌డీపీఓ సీహెచ్. రాజా పర్యవేక్షణలో పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
వీరు విశాఖ పెందుర్తి మండలం కోకవానిపాలెంలో అద్దె ఇంట్లో నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
రూ.6.02 లక్షల నకిలీ నోట్లు, రూ.6 వేల ఒరిజినల్ నగదు, 3 సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, ల్యామినేషన్ మెషిన్ తదితర పరికరాలను సీజ్ చేసి నిందితులను బంటుమిల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. నకిలీ నోట్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.