పలమనేరు,జూన్11,2020(పున్నమి విలేకరి):పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని నాలుగు రోడ్లు వద్ద ఎలాంటి అర్హత లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తూ నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. వివరాలోకి వెళ్ళితే…గంగవరం మండలంలోని నాలుగు రోడ్లు వద్ద R V క్లినిక్ పేరుతో డాక్టర్ శివ (MBBS) ఆసుపత్రి ప్రారంభించారు. కొద్ది రోజులు రోగులకు వైద్య చికిత్సలు అందించారు. డాక్టర్ శివ ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళారు. డాక్టర్ శివ ప్రారంభించిన ఆసుపత్రిలో మహేంద్ర పనిచేశాడు. డాక్టర్ శివ విదేశాలుకు వెళ్లిన తర్వాత నకిలీ వైద్యడు మహేంద్ర తాను కూడా MBBS చేసినట్లు ప్రజల వైద్యం చేస్తున్నాడు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యడు మహేంద్ర ప్రజలకు సరైన వైద్యం అందించకుండా పోవడంతో ఫిర్యాదులు రావడంతో పత్తికొండ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆదేశాలు మేరకు డాక్టర్ యుగంధర్ ఆస్పత్రి తనిఖీ చేయగా నకిలీ వైద్యడు మహేంద్ర పరారీలో ఉన్నాడు. దాంతో ఆస్పత్రిని తాళాలు వేసి సీజ్ చేసినట్లు డాక్టర్ యుగంధర్ తెలిపారు.