Tuesday, 31 March 2026
  • Home  
  • నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌
- ఖమ్మం

నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌

నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌ కామారెడ్డి కలెక్టరేట్లో ఒక మహిళ చీటింగ్ ఉద్యోగం వచ్చిందని నమ్మించేందుకు యత్నం గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ఇస్రత్‌ కామారెడ్డి: తాను ఐఏఎస్‌నని, ఇంచార్జి కలెక్టర్‌ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో ఒక మహిళ కామారెడ్డి కలెక్టరేట్‌లో హంగామా సృష్టించింది. అసలు కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సెలవులో ఉండగా నిజామాబాద్‌ కలెక్టర్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌ జీడిమెట్లకు చెందిన ఇస్రత్‌ జహాన్‌ అనే మహిళ కారులో వచ్చి కలెక్టర్‌ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంచార్జి కలెక్టర్‌గా తనను నియమించారని నకిలీ ఉత్తర్వులు చూపగా అనుమానం వచ్చిన అదనపు కలెక్టర్‌ ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపామని, పైనుంచి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని ఆమెకు తెలిపారు. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో కలెక్టరేట్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్‌ వద్ద మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా 2020 నుంచి గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ఆమె ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ విఫలయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు చేసి వదిలేశారు.

నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌
కామారెడ్డి కలెక్టరేట్లో ఒక మహిళ చీటింగ్
ఉద్యోగం వచ్చిందని నమ్మించేందుకు యత్నం
గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ఇస్రత్‌
కామారెడ్డి:
తాను ఐఏఎస్‌నని, ఇంచార్జి కలెక్టర్‌ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో ఒక మహిళ కామారెడ్డి కలెక్టరేట్‌లో హంగామా సృష్టించింది. అసలు కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సెలవులో ఉండగా నిజామాబాద్‌ కలెక్టర్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌ జీడిమెట్లకు చెందిన ఇస్రత్‌ జహాన్‌ అనే మహిళ కారులో వచ్చి కలెక్టర్‌ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంచార్జి కలెక్టర్‌గా తనను నియమించారని నకిలీ ఉత్తర్వులు చూపగా అనుమానం వచ్చిన అదనపు కలెక్టర్‌ ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపామని, పైనుంచి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని ఆమెకు తెలిపారు. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో కలెక్టరేట్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్‌ వద్ద మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా 2020 నుంచి గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ఆమె ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ విఫలయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు చేసి వదిలేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.