Tuesday, 24 March 2026
  • Home  
  • నంద్యాల సెయింట్ మాథ్యూస్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: ఎన్ఎండి ఫరూక్
- Blog

నంద్యాల సెయింట్ మాథ్యూస్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణం జ్ఞానాపురంలోని సి.ఎస్.ఐ. సెయింట్ మాథ్యూస్ చర్చి (ఫాస్ట్రేట్ -3) నందు క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణంలో మంత్రి ఫరూక్ కి క్రైస్తవ పెద్దలు, సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను చాటిచెప్పిన ఏసుక్రీస్తు జన్మదినం మానవాళికే పండుగ రోజని మంత్రి కొనియాడారు. నంద్యాల జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో పండుగలు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మన్నె కృపాకర్, 33వ వార్డు టీడీపీ ఇంచార్జ్ జోసెఫ్, 26వ వార్డు టిడిపి ముఖ్య నాయకులు మల్లెల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, జార్జ్, శరత్, దివాకర్, సందీప్, దేవరాజ్, ఓబులేష్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

నంద్యాల పట్టణం జ్ఞానాపురంలోని సి.ఎస్.ఐ. సెయింట్ మాథ్యూస్ చర్చి (ఫాస్ట్రేట్ -3) నందు క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణంలో మంత్రి ఫరూక్ కి క్రైస్తవ పెద్దలు, సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను చాటిచెప్పిన ఏసుక్రీస్తు జన్మదినం మానవాళికే పండుగ రోజని మంత్రి కొనియాడారు. నంద్యాల జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో పండుగలు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మన్నె కృపాకర్, 33వ వార్డు టీడీపీ ఇంచార్జ్ జోసెఫ్, 26వ వార్డు టిడిపి ముఖ్య నాయకులు మల్లెల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, జార్జ్, శరత్, దివాకర్, సందీప్, దేవరాజ్, ఓబులేష్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.