నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం – 2025’ మరియు ‘జాతీయ విద్యా దినోత్సవం’ వేడుకలను 11 వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ కలిసి నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ ను పరిశీలించడం జరిగింది
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం మరియు దేశంలో విద్యా సంస్కరణలకు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటారని కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు హాజరవుతున్నారని తెలిపారు . అలాగే నంద్యాల జిల్లాలోని మైనారిటీ వర్గాల ప్రజలు, విద్యావేత్తలు మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మరియు నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ కోరారు
ఈ కార్యక్రమంలో అస్ముద్దీన్ , అంజద్ భాషా సిద్దికి , మహమ్మద్ , బాగే తదితరులు పాల్గొన్నారు


