Wednesday, 11 February 2026
  • Home  
  • నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె
- E-పేపర్

నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె

నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె (పెన్ డౌన్)18-9-2025 తేదీ నుండి 20-9-2025 తేదీ వరకు అనగా గురు, శుక్ర, శనివారములు వరసగా (3) మూడు రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్సులు ఫరూక్, రమేష్ లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటిపి, మొబైల్ ఓటిపి, పిడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండు చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు పట్టణ, గ్రామ ప్రజలు సహకరించవలసినదిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సంజీవరావ్, సుబ్రహ్మణ్యం, గిరిబాబు, రామకృష్ణ, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.