నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్
నంద్యాల 25/06/2025 పున్నమి రిపోర్టర్
నంద్యాల డిపో నందు గత రెండు సంవ్సతరాల నుండి ప్రతి నెల పౌర్ణమి రోజులలో అరుణాచలం కి సూపర్ లగ్జరీ (2+2) స్పెషల్ బస్సు నడుపబడుచున్నది. జూలై నెల కూడా అనగా 10.07.25 వ తేదిన ఉదయం 07:30 గం., అరుణాచలం కు బస్సు నడపడం జరుగుతుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది . రానుపోను చార్జి రిజర్వేషన్ తో కలిపి 1750 రూపాయలు అగును. నంద్యాల పట్టణ మరియు చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగపరుచుకోవలసిందిగా డిపో మేనేజర్ ఏ. గంగాధర రావు తెలుపటం అయినది.