కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు నంద్యాల డిపో తనిఖీ చేయడం జరిగింది. బస్టాండ్ గ్యారేజ్ తనిఖీ చేసి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. శ్రీ శక్తి పథకము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయవలెనని బస్సుల కండిషన్ చెక్ చేసి ఫెయిల్యూర్ లేకుండా చూసుకోవాలని సిబ్బందికి గేట్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే బస్టాండ్ లో ప్రయాణికులతో కూడా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. యాల్లూరు కు వెళ్ళు ప్రయాణికురాలు ట్రిప్పులు పెంచవలెనని కోరగా డిపిటిఓ కి వారి విజ్ఞప్తిని పరిశీలించి ట్రిప్పులు పెంచుటకు చర్యలు తీసుకోమని చెప్పినారు. బస్టాండ్ లో మహిళా ప్రయాణికులను స్త్రీ శక్తి పథకం గురించి తెలియజేయగా వారు చాలా హర్షం వ్యక్తం చేశారు.అలాగే నంద్యాల డిపోలో 493 బస్సులు ఉన్నాయని వాటిలో 378 బస్సులు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీస్ లు ఉన్నాయని వాటిలో శ్రీ శక్తి పథకం క్రింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలియజేశారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్టాండ్ లో ప్రయాణీకులకు అన్ని సదుపాయాలు కలిగించి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని డి పి డి ఓ ని ఆదేశించినారు.

నంద్యాల డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు