Tuesday, 24 March 2026
  • Home  
  • నంద్యాల – గుంతకల్లు మధ్య పగటి పూట రైలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
- E-పేపర్

నంద్యాల – గుంతకల్లు మధ్య పగటి పూట రైలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

నంద్యాల జిల్లా రైలు ప్రయాణికుల ఇబ్బందులు ఇటీవల పార్లమెంట్ వేదికగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికీ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకెళ్లారు. లోక్ సభలోనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్డు వరకు పగటి పూట రైలు నడుపనున్నట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం తెలిపారు. మార్కాపురం _ నంద్యాల _ గుంతకల్ రూట్ లో ప్యాసింజర్ ట్రైన్ కు రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఈ ట్రైన్ నెంబర్(57408) మార్కాపురంలో తెల్లవారు జామున 4:30 గంటలకు ప్రారంభం అయ్యి నంద్యాలకు ఉదయం 7:20 గంటలకు చేరుకొని డోన్ మీదుగా గుంతకల్లుకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటుందనీ, ఇదే ట్రైన్ నెంబర్(57407) తిరుగు ప్రయాణంలో గుంతకల్లులో సాయంత్రం 5:30 కి ప్రారంభం అయ్యి నంద్యాల కు రాత్రి 8:30 కి చేరుకొని మార్కాపూర్ కు 10:30 గంటలకు చేరుకుంటుందనీ, త్వరలో పట్టాలు ఎక్కనున్న ఈ రైలును నంద్యాల జిల్లా ప్రజలు గుంతకల్లు వైపు పగటి పూట రైలు ప్రయాణం సద్వినియోగం చేసుకువాలని, తన విన్నపాన్ని అంగీకరించి నంద్యాల – గుంతకల్లు వైపు పగటి పూట రైలు వేసినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధన్యవాదములు తెలిపారు.

నంద్యాల జిల్లా రైలు ప్రయాణికుల ఇబ్బందులు ఇటీవల పార్లమెంట్ వేదికగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికీ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకెళ్లారు. లోక్ సభలోనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్డు వరకు పగటి పూట రైలు నడుపనున్నట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం తెలిపారు.

మార్కాపురం _ నంద్యాల _ గుంతకల్ రూట్ లో
ప్యాసింజర్ ట్రైన్ కు
రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ,
ఈ ట్రైన్ నెంబర్(57408)
మార్కాపురంలో తెల్లవారు జామున 4:30 గంటలకు ప్రారంభం అయ్యి నంద్యాలకు ఉదయం 7:20 గంటలకు చేరుకొని డోన్ మీదుగా గుంతకల్లుకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటుందనీ,
ఇదే ట్రైన్ నెంబర్(57407) తిరుగు ప్రయాణంలో గుంతకల్లులో సాయంత్రం 5:30 కి ప్రారంభం అయ్యి నంద్యాల కు రాత్రి
8:30 కి చేరుకొని
మార్కాపూర్ కు 10:30 గంటలకు చేరుకుంటుందనీ, త్వరలో పట్టాలు ఎక్కనున్న ఈ రైలును నంద్యాల జిల్లా ప్రజలు గుంతకల్లు వైపు పగటి పూట రైలు ప్రయాణం సద్వినియోగం చేసుకువాలని, తన విన్నపాన్ని అంగీకరించి నంద్యాల – గుంతకల్లు వైపు పగటి పూట రైలు వేసినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధన్యవాదములు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.