Sunday, 7 December 2025
  • Home  
  • నంద్యాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
- Blog

నంద్యాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

నంద్యాల భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం 2025 ను మొదటగా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థూపం దగ్గర ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి సబిహా పర్వీన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ , నంద్యాల డియోసెస్ బిషప్ ఆర్టీ రెవ్ సంతోష్ ప్రసన్నరావు జోసప్ , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి, ఉర్దూ డిఐ అస్ముద్దీన్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ , మెప్మా పీడీ వెంకట దాస్ తదితరులు హాజరయ్యారు ముందుగా, ముఖ్య అతిథులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ చేసిన పోరాటం, అలాగే స్వతంత్ర భారతంలో ఆయన తొలి విద్యా శాఖ మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. “ఆజాద్ గారు దేశంలో శాస్త్ర, సాంకేతిక విద్య అభివృద్ధికి, ఉన్నత విద్య సంస్థల ఏర్పాటుకు బలమైన పునాదులు వేశారని . ఆయన కృషి ఫలితంగానే నేడు మన దేశం విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తోందని . నేటి యువత ఆజాద్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి సబిహా పర్వీన్ మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని, ఐకమత్యాన్ని పెంపొందించడంలో ఆజాద్ ఆశయాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు మెమెంటోను , ప్రశంసా పత్రాన్ని బహుకరించడం జరిగింది. అలాగే వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన మైనార్టీ , క్రిస్టియన్ మైనార్టీ ప్రజలను ముఖ్యఅతిథిలు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ మైనార్టీ సంఘాల నాయకులు , మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, నంద్యాల పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాల భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం 2025 ను మొదటగా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థూపం దగ్గర ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి సబిహా పర్వీన్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ , నంద్యాల డియోసెస్ బిషప్ ఆర్టీ రెవ్ సంతోష్ ప్రసన్నరావు జోసప్ , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి, ఉర్దూ డిఐ అస్ముద్దీన్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ , మెప్మా పీడీ వెంకట దాస్ తదితరులు హాజరయ్యారు

ముందుగా, ముఖ్య అతిథులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ చేసిన పోరాటం, అలాగే స్వతంత్ర భారతంలో ఆయన తొలి విద్యా శాఖ మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. “ఆజాద్ గారు దేశంలో శాస్త్ర, సాంకేతిక విద్య అభివృద్ధికి, ఉన్నత విద్య సంస్థల ఏర్పాటుకు బలమైన పునాదులు వేశారని . ఆయన కృషి ఫలితంగానే నేడు మన దేశం విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తోందని . నేటి యువత ఆజాద్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు.

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి సబిహా పర్వీన్ మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని, ఐకమత్యాన్ని పెంపొందించడంలో ఆజాద్ ఆశయాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు మెమెంటోను , ప్రశంసా పత్రాన్ని బహుకరించడం జరిగింది. అలాగే వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన మైనార్టీ , క్రిస్టియన్ మైనార్టీ ప్రజలను ముఖ్యఅతిథిలు ఘనంగా సన్మానించడం జరిగింది

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ మైనార్టీ సంఘాల నాయకులు , మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, నంద్యాల పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.