నంద్యాల తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జెఎస్.పి) , భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల కూటమి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్‌లో భారీ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, విజయవంతం చేయాలని . ఇది కేవలం ఒక సభ కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే వేదిక అని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభ ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూల్ సమీపంలోని నన్నూరు దగ్గర ఉన్న రాగ మయూరి వెంచర్‌లో జరుగుతుందని తెలిపారు. నంద్యాల ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సాక్షిగా నిలవనుందని ఆయన అన్నారు. నంద్యాల నియోజకవర్గం నుంచి దాదాపు 30 వేల మంది ప్రజలు ఈ చారిత్రక సభకు హాజరు కావాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలియజేశారు. “ప్రతి డివిజన్, ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా కూటమి శ్రేణులు కృషి చేయాలన్నారు . ఈ సభ విజయవంతం కావడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకం” అని ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యంగా రానున్న ఐదేళ్ల ప్రగతికి సంబంధించి కీలకమైన మరియు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉందని మంత్రి ఫరూక్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశగా మనకు కొత్త స్ఫూర్తిని, దిశను అందిస్తుందని. కావున, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక సభకు హాజరై, ప్రధాని ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఆయన కోరారు. కర్నూలలో జరగబోయే ఈ సభను కూటమి పక్షాలు ఒక శక్తి ప్రదర్శనగా మార్చడానికి, తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి సంసిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు . అనంతరం మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో అక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులకు ప్రజలకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, శాప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడు,నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జనసేన నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, ఏవిఆర్ ప్రసాద్, తులసి రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, శ్రీశైలం దేవస్థానం ట్రస్ బోర్డు మెంబర్ మేడ మురళీధర్, బిజెపి సీనియర్ నాయకులు ఇంటి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు అధికారులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

నంద్యాలలో కూటమి పార్టీల సన్నాహక సమావేశం నరేంద్ర మోడీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మారుద్దాం :-మంత్రి ఫరూక్ పిలుపు