నంద్యాల పట్టణంలో ఆర్యవైశ్యులు అందరూ ప్రతి ఎన్నికల్లో మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. కార్తీక్ మాసం సందర్భంగా శ్రీ ప్రథమ నంది దేవాలయంలో శ్రీ బాలాజీ కాంప్లెక్ ఆర్యవైశ్య సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక్ వన భోజనాలకు ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ ఎన్నికల్లో మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా మా నాన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్, నేను ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యుల ఇళ్ల మధ్యనే మా ఇళ్లు ఉందని గుర్తుచేశారు. స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరు పద్మావతి నగర్ కానీ ఇతర ప్రదేశాల్లో మంచి ఇల్లు కట్టుకో అని సలహా ఇచ్చినా ఆర్యవైశ్యుల ఇళ్ల వద్ద ఉండే గొప్పతనం మాకు తెలుసన్నారు. సమాజంలో” అయ్యా” అని గౌరవంగా పిలిచేది ఒక్క ఆర్యవైశ్యులకే దక్కుతుందన్నారు. నంద్యాలలో ఉన్న పెద్ద, పెద్ద ఆర్యవైశ్యులు అందరూ అన్నదమ్ముల వలె ఉంటామన్నారు. ఆర్యవైశ్యులు సమస్యలు ఎదురైతే మీలో ఉన్న వారి దృష్టికి తీసుకొని వస్తె సమస్యలు పరిష్కరించడానికి ముందుంటున్నారు. మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యులు ఆదరించడం వల్లా మా నాన్నకు నాలుగు సార్లు మంత్రి పదవులు రావడానికి మీ పాత్ర ఉందన్నారు. గత ఎన్నికల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగాయని ఆర్యవైశ్యులు తెలుగుదేశంపార్టీకి 99 శాతం ఓట్లు వేసి గెలిపించారని అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. కార్తీక్ మాసంలో ఆర్యవైశ్యులు కుటుంబసభ్యులతో కలిసిరావడం సంతోషంగా ఉందన్నారు. కార్తీక్ మాసం వనభోజనాలు కు రావడం ఆనందంగా ఉందని అందరికీ ఆ శివపార్వతుల ఆశీర్వాదాలు కలగాలని కోరారు. అనంతరం నిర్వాహకులు ఎన్ఎండి ఫిరోజ్ ని , శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మేడా మురళీధర్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, ఇల్లూరి లక్ష్మయ్య , భీమిశెట్టి మనోజ్ కుమార్ , నంద్యాల నాగేంద్ర , మిరియాల చంద్రమౌళి , బింగుమల్ల సుబ్బలక్ష్మయ, మున్సిపల్ వైస్ చైర్మెన్ గంగిశెట్టి నాగ శ్రీధర్, కశేట్టి చంద్ర శేఖర్ , విజయ్ కుమార్ , నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య , తదితరులు పాల్గొన్నారు.


