Friday, 13 February 2026
  • Home  
  • ​నందిపాడు సెంటర్‌లో ‘సోలార్’ వెలుగులు: ప్రయాణికులకు తప్పిన చీకటి కష్టాలు ​
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

​నందిపాడు సెంటర్‌లో ‘సోలార్’ వెలుగులు: ప్రయాణికులకు తప్పిన చీకటి కష్టాలు ​

దుత్తలూరు 13-2-2026 ​నందిపాడు (NH 565) జాతీయ రహదారి 565 పై గల నందిపాడు సెంటర్ ఇప్పుడు సోలార్ వెలుగులతో మెరిసిపోతోంది. గత కొంతకాలంగా రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, స్థానికుల సౌకర్యార్థంనేషనల్ హైవే అధికారులు నందిపాడు సెంటర్లో సుమారు ఒక కిలోమీటర్ సోలార్ వీధి దీపాలను రోడ్డు కి ఇరువైపులా ఏర్పాటు చేశారు, రాత్రి సమయాల్లో ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ జంక్షన్‌లో, సోలార్ లైట్ల ఏర్పాటుతో వాహనదారులకు స్పష్టమైన మార్గం కనిపిస్తోంది, కరెంట్ఆదా చేయడంతో పాటు, పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ సోలార్ వ్యవస్థను రూపొందించారు. ​నందిపాడు చుట్టుపక్కల వ్యాపారస్తులు మరియు రాత్రి వేళల్లో నడిచే పాదచారులు ఈ మార్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ​గతంలో చీకటి కారణంగా మలుపుల వద్ద ఇబ్బందులు, ఆక్సిడెంట్ లు జరిగేవి, ఇప్పుడు ఆధునిక సోలార్ లైట్ల వల్ల రాత్రి పూట కూడా పగలులా వెలుతురు ఉండటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారి వెంబడి మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి వెలుగులు నింపాలని ప్రజలు కోరుతున్నారు.

దుత్తలూరు
13-2-2026
​నందిపాడు (NH 565)
జాతీయ రహదారి 565 పై గల నందిపాడు సెంటర్ ఇప్పుడు సోలార్ వెలుగులతో మెరిసిపోతోంది. గత కొంతకాలంగా రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, స్థానికుల సౌకర్యార్థంనేషనల్ హైవే అధికారులు నందిపాడు సెంటర్లో సుమారు ఒక కిలోమీటర్ సోలార్ వీధి దీపాలను రోడ్డు కి ఇరువైపులా ఏర్పాటు చేశారు, రాత్రి సమయాల్లో ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ జంక్షన్‌లో, సోలార్ లైట్ల ఏర్పాటుతో వాహనదారులకు స్పష్టమైన మార్గం కనిపిస్తోంది, కరెంట్ఆదా చేయడంతో పాటు, పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ సోలార్ వ్యవస్థను రూపొందించారు.
​నందిపాడు చుట్టుపక్కల వ్యాపారస్తులు మరియు రాత్రి వేళల్లో నడిచే పాదచారులు ఈ మార్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
​గతంలో చీకటి కారణంగా మలుపుల వద్ద ఇబ్బందులు, ఆక్సిడెంట్ లు జరిగేవి, ఇప్పుడు ఆధునిక సోలార్ లైట్ల వల్ల రాత్రి పూట కూడా పగలులా వెలుతురు ఉండటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారి వెంబడి మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి వెలుగులు నింపాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.