దుత్తలూరు
19-2-2026
నందిపాడు సెంటర్‌లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు, బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేల్ నుంచి ఒక కారు వస్తుండగా, అదే సమయంలో ఆత్మకూరు నుంచి ఒక వ్యక్తి తన బైక్‌పై వస్తున్నారు. నందిపాడు సెంటర్ వద్దకు చేరుకోగానే రెండు వాహనాలు వేగంగా ఉండటంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కాలు కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నందిపాడు సెంటర్‌లో ప్రమాదం: బైక్-కారు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు
దుత్తలూరు 19-2-2026 నందిపాడు సెంటర్‌లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు, బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేల్ నుంచి ఒక కారు వస్తుండగా, అదే సమయంలో ఆత్మకూరు నుంచి ఒక వ్యక్తి తన బైక్‌పై వస్తున్నారు. నందిపాడు సెంటర్ వద్దకు చేరుకోగానే రెండు వాహనాలు వేగంగా ఉండటంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కాలు కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

