Thursday, 2 April 2026
  • Home  
  • నందిపాడు లో వ్యక్తి ఆత్మహత్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు లో వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం (ఉస్మాన్ పున్నమి రిపోర్టర్ ) నందిపాడు ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో బక్కా ప్రసాద్ (32) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు, కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు

నెల్లూరు జిల్లా
దుత్తలూరు మండలం
(ఉస్మాన్ పున్నమి రిపోర్టర్ )
నందిపాడు ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో బక్కా ప్రసాద్ (32) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారం మేరకు, కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.