దుత్తలూరు
Date:18-1-2026
నందిపాడు సెంటర్ లొ ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి: నివాళులర్పించిన నాయకులు
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం నందిపాడులో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి ఆధ్వర్యంలో, ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానేత నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయ రామిరెడ్డి గారు దంపతులు పాల్గొని ఎన్టీఆర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు, అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లొ మాజీ ఎంపీపీ రవీందర్ బాబు గారూ, సొసైటీ అధ్యక్షులు మధు గారూ, గ్రామ టీడీపీ అధ్యక్షులు మరియు నాయకులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
నందిపాడు లొ ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
దుత్తలూరు Date:18-1-2026 నందిపాడు సెంటర్ లొ ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి: నివాళులర్పించిన నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం నందిపాడులో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి ఆధ్వర్యంలో, ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానేత నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయ రామిరెడ్డి గారు దంపతులు పాల్గొని ఎన్టీఆర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు, అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లొ మాజీ ఎంపీపీ రవీందర్ బాబు గారూ, సొసైటీ అధ్యక్షులు మధు గారూ, గ్రామ టీడీపీ అధ్యక్షులు మరియు నాయకులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

