Story highlights
- ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలోని ఎస్‌కేఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలోని ఎస్‌కేఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలబాలికలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ రహీం, ఉపాధ్యాయులు గోవిందమ్మ, మేరీ, గీత తదితరులు పాల్గొన్నారు.