విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నందిగామ హైవే సమీపంలో శనివారం సాయంత్రం ఆగిపోయింది. బస్సు ఇంజిన్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికు ల్లో భయాందోళన నెలకొంది. ఈ విషయం గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రహదారి పక్కన నిలిపి, అందులో ఉన్న 15 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ఆ ప్రయాణికులను మరో బస్సులో కోదాడకు తరలించారు. ఇంజిన్లో ఆయిల్ లీక్ అవ్వడం వల్ల పొగలు వ్యాపించాయని డ్రైవర్ తెలిపారు. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ చాకచక్యం తో పెద్ద ప్రమాదం తప్పింది.

నందిగామ వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు.. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది