Thursday, 5 February 2026
  • Home  
  • నందిగామ: తుఫాన్ సంసిద్ధత లోపాల నివారణ చర్యలు
- ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ: తుఫాన్ సంసిద్ధత లోపాల నివారణ చర్యలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు నేతృత్వంలో నందిగామ పురపాలక సంఘం లోతట్టు ప్రాంతాలలో తుఫాన్ ప్రభావం మరియు రాబోవు 5 రోజుల భారీ వర్షాల కారణంగా జలమయం, నష్టాలు మరియు ప్రమాదాలు కలగకుండా ముందస్తుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. *పునరావాస కేంద్రాలు* : బాబు జగజ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ (పాత బస్టాండ్) జిల్లా పరిషత్ హై స్కూల్ మధిర రోడ్ లో కేంద్రీయ విద్యాలయం ఈ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, జనరేటర్లు, మంచినీరు మరియు విద్యుత్ సౌకర్యాలు సమస్యలేమి లేకుండా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే, పట్టణం లోని శిధిల భవనాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. *ఇతర చర్యలు* : ఎండిపోయిన చెట్లను తొలగించడం ప్రధాన డ్రెయిన్లలో జలమయం మరియు మురుగు నీరు నిలవకుండా జెసిబి ద్వారా పూడికలు తొలగించడం సమస్యలు ఏర్పడకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. ఫణి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కే.దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు నేతృత్వంలో నందిగామ పురపాలక సంఘం లోతట్టు ప్రాంతాలలో తుఫాన్ ప్రభావం మరియు రాబోవు 5 రోజుల భారీ వర్షాల కారణంగా జలమయం, నష్టాలు మరియు ప్రమాదాలు కలగకుండా ముందస్తుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

*పునరావాస కేంద్రాలు* :
బాబు జగజ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ (పాత బస్టాండ్)
జిల్లా పరిషత్ హై స్కూల్
మధిర రోడ్ లో కేంద్రీయ విద్యాలయం ఈ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, జనరేటర్లు, మంచినీరు మరియు విద్యుత్ సౌకర్యాలు సమస్యలేమి లేకుండా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే, పట్టణం లోని శిధిల భవనాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది.

*ఇతర చర్యలు* :
ఎండిపోయిన చెట్లను తొలగించడం
ప్రధాన డ్రెయిన్లలో జలమయం మరియు మురుగు నీరు నిలవకుండా జెసిబి ద్వారా పూడికలు తొలగించడం
సమస్యలు ఏర్పడకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. ఫణి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కే.దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.