నందిగామ పట్టణంలోని కుమారస్వామి నగర గణపతి శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 24 నుండి 28 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
సోమవారం సాయంత్రం విశ్వక్సేనారాధన, అంకురారోపణ, హోమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
25వ తేదీ మంగళవారం స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, నిత్యహోమాలు, ‘పెళ్లికొడుకు’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి దివ్యకళ్యాణం ఘనంగా జరగనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకుఅన్నప్రసాద వితరణ ఉంటుంది.
27వ తేదీ గురువారం మూలమంత్ర హోమాది క్రతువులు, పూర్ణాహుతి, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడుతుందని కమిటీ వివరించింది.
28వ తేదీ శుక్రవారం దీపోత్సవం, ఊంజల సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.

నందిగామలో సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవాలు 24 నుండి
నందిగామ పట్టణంలోని కుమారస్వామి నగర గణపతి శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 24 నుండి 28 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం విశ్వక్సేనారాధన, అంకురారోపణ, హోమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీ మంగళవారం స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, నిత్యహోమాలు, ‘పెళ్లికొడుకు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి దివ్యకళ్యాణం ఘనంగా జరగనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకుఅన్నప్రసాద వితరణ ఉంటుంది. 27వ తేదీ గురువారం మూలమంత్ర హోమాది క్రతువులు, పూర్ణాహుతి, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడుతుందని కమిటీ వివరించింది. 28వ తేదీ శుక్రవారం దీపోత్సవం, ఊంజల సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.

