నందిగామలో శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్ మోహన్ రావు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చంద్రబాబు ప్రభుత్వం నూటికి నూరు శాతం పిచ్చి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలు కాదు, కేవలం ప్రైవేట్ ప్రయోజ నాలకే పాలన సాగుతోంది” అని అన్నారు.నందిగామలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు, ఆవేదన, పత్తి కొనుగోళ్ల సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని తెలిపారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ఇప్పటివరకు మినుములు, పెసలు, అపరాలు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కపాస్ యాప్ ద్వారా దళారుల దోపిడీపై ప్రశ్నించాకే ప్రభుత్వం నిద్రలేచిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రెండు సంవత్సరాల పాలనలో నందిగామకు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిని తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాల పై ఎమ్మెల్యే–ఎంపీలకు ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని విమర్శించారు. రాఘవపురంలో అక్రమ గ్రావెల్ తవ్వకాల వల్ల రెండు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి, మిర్చి, పప్పుధాన్యాల కొనుగోళ్లు జరిగాయని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి పాలనలో రైతులకు పట్టించుకునే నాథుడే లేడన్నారు. తమపై గతంలో చేసిన అవినీతి ఆరోపణలను ఇప్పుడు అధికారంలో ఉన్నవారే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించ డమే కూటమి ప్రభుత్వలక్ష్యమా అని ప్రశ్నించారు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

నందిగామలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డా.మొండితోక జగన్ మోహన్ రావు
నందిగామలో శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్ మోహన్ రావు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చంద్రబాబు ప్రభుత్వం నూటికి నూరు శాతం పిచ్చి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలు కాదు, కేవలం ప్రైవేట్ ప్రయోజ నాలకే పాలన సాగుతోంది” అని అన్నారు.నందిగామలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు, ఆవేదన, పత్తి కొనుగోళ్ల సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని తెలిపారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ఇప్పటివరకు మినుములు, పెసలు, అపరాలు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కపాస్ యాప్ ద్వారా దళారుల దోపిడీపై ప్రశ్నించాకే ప్రభుత్వం నిద్రలేచిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రెండు సంవత్సరాల పాలనలో నందిగామకు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిని తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాల పై ఎమ్మెల్యే–ఎంపీలకు ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని విమర్శించారు. రాఘవపురంలో అక్రమ గ్రావెల్ తవ్వకాల వల్ల రెండు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి, మిర్చి, పప్పుధాన్యాల కొనుగోళ్లు జరిగాయని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి పాలనలో రైతులకు పట్టించుకునే నాథుడే లేడన్నారు. తమపై గతంలో చేసిన అవినీతి ఆరోపణలను ఇప్పుడు అధికారంలో ఉన్నవారే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించ డమే కూటమి ప్రభుత్వలక్ష్యమా అని ప్రశ్నించారు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

