Tuesday, 24 March 2026
  • Home  
  • నందిగామలో మోంథా తుఫాన్ ప్రభావం: లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరద పరిస్థితులు
- ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మోంథా తుఫాన్ ప్రభావం: లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరద పరిస్థితులు

మోంథా తుఫాన్ ప్రభావం మరియు అల్పపీడనం కారణంగా నందిగామ పురపాలక సంఘ పరిధిలో భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, ప్రజల వసతి, రహదారి పరిస్థితులు భయంకరంగా మారాయి. మునిసిపల్ జి.లోవరాజు ఈ ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు చేరిన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి ఆహార సదుపాయాలు అందజేశారు. ప్రధాన డ్రెయిన్లలో నిలిచిన వరద మరియు మురుగు నీటిని జె.సి.బీ సాయంతోతొలగించడం జరిగింది. ప్రజలకు అత్యవసరం కాకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకుండా సూచనలు ఇవ్వబడ్డాయి. సమస్యలపై తక్షణం స్పందించేందుకు పురపాలక సంఘ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో మునిసిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.ఫణి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కే.దుర్గా ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మోంథా తుఫాన్ ప్రభావం మరియు అల్పపీడనం కారణంగా నందిగామ పురపాలక సంఘ పరిధిలో భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, ప్రజల వసతి, రహదారి పరిస్థితులు భయంకరంగా మారాయి.
మునిసిపల్ జి.లోవరాజు ఈ ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు చేరిన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి ఆహార సదుపాయాలు అందజేశారు. ప్రధాన డ్రెయిన్లలో నిలిచిన వరద మరియు మురుగు నీటిని జె.సి.బీ సాయంతోతొలగించడం జరిగింది. ప్రజలకు అత్యవసరం కాకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకుండా సూచనలు ఇవ్వబడ్డాయి. సమస్యలపై తక్షణం స్పందించేందుకు పురపాలక సంఘ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో మునిసిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.ఫణి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కే.దుర్గా ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.