నందిగామ మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందిగామ మండలంలో వరద పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. చందాపురం గ్రామం వద్ద నల్లవాగులో నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితు లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, “ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ప్రయాణికులు పొంగుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు,” అని సూచించారు. తుఫాన్ ఉధృతి కొనసాగుతున్నందున అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, అవసర మైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలకు తాజా అప్‌డేట్‌లు అందించాలని ఆమె అధికారులకు సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, ఆర్డీఓ బాలకృష్ణ, ఎసీపీ తిలక్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, అధికారులు, కూటమినేతలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నందిగామలో మొంథా తుఫాన్ ప్రభావం – చందాపురం వద్ద నల్లవాగు వరద పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందిగామ మండలంలో వరద పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. చందాపురం గ్రామం వద్ద నల్లవాగులో నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితు లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, “ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ప్రయాణికులు పొంగుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు,” అని సూచించారు. తుఫాన్ ఉధృతి కొనసాగుతున్నందున అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, అవసర మైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలకు తాజా అప్‌డేట్‌లు అందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, ఆర్డీఓ బాలకృష్ణ, ఎసీపీ తిలక్, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, అధికారులు, కూటమినేతలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

