Thursday, 5 February 2026
  • Home  
  • నందిగామలో మక్కా మసీదు పరిసర ఇళ్లు నీట మునిగే ప్రమాదం – చెరువు నీరు ఇళ్లలోకి చేరింది, ప్రజలు ఆందోళనలో
- ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మక్కా మసీదు పరిసర ఇళ్లు నీట మునిగే ప్రమాదం – చెరువు నీరు ఇళ్లలోకి చేరింది, ప్రజలు ఆందోళనలో

నందిగామ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా రెండో వార్డులో ఉన్న చెరువు ప్రాంతం ప్రస్తుతం నీటమునిగే పరిస్థితిలో ఉంది. ఈ చెరువులో ఉన్న మక్కా మసీదుతో పాటు దాని పక్కన ఉన్న అనేక ఇళ్లలో కి చెరువు నీరు ప్రవేశిస్తోంది. స్థానిక నివాసితులు చెబుతున్న ట్లుగా, చెరువులోకి వర్షపు నీరు చేరడంతో మసీదు ప్రాంగణం మరియు ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజులలో తుఫాన్, భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, పరిస్థితి మరింత విషమించ వచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం పార్టీ నాయకుడు కరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, “ఈ ప్రాంతం చెరువు ప్రాంతమని ప్రభుత్వానికి తెలుసు. అయినా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇళ్లపట్టాలు జారీ చేసి ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు నీరు మసీదులోకీ ఇళ్లలోకీ వచ్చి ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులు వచ్చి చెరువు నీటిని పక్కకు మళ్లించే చర్యలు తీసుకోవాలి,” అని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ శాఖ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ తక్షణమే స్పందించి చెరువు నీరు మసీదు మరియు ఇళ్లలోకి రాకుండా తాత్కాలిక గాడి లేదా పంప్ సెట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నందిగామ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా రెండో వార్డులో ఉన్న చెరువు ప్రాంతం ప్రస్తుతం నీటమునిగే పరిస్థితిలో ఉంది. ఈ చెరువులో ఉన్న మక్కా మసీదుతో పాటు దాని పక్కన ఉన్న అనేక ఇళ్లలో కి చెరువు నీరు ప్రవేశిస్తోంది.
స్థానిక నివాసితులు చెబుతున్న ట్లుగా, చెరువులోకి వర్షపు నీరు చేరడంతో మసీదు ప్రాంగణం మరియు ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజులలో తుఫాన్, భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, పరిస్థితి మరింత విషమించ వచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం పార్టీ నాయకుడు కరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, “ఈ ప్రాంతం చెరువు ప్రాంతమని ప్రభుత్వానికి తెలుసు. అయినా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇళ్లపట్టాలు జారీ చేసి ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు నీరు మసీదులోకీ ఇళ్లలోకీ వచ్చి ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులు వచ్చి చెరువు నీటిని పక్కకు మళ్లించే చర్యలు తీసుకోవాలి,”
అని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజలు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ శాఖ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ తక్షణమే స్పందించి చెరువు నీరు మసీదు మరియు ఇళ్లలోకి రాకుండా తాత్కాలిక గాడి లేదా పంప్ సెట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.