Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Annamayya

నందలూరు ఎస్ఐగా మహేష్ నాయుడు బాధ్యతల స్వీకరణ

Punnami Newsroom Published:
నందలూరు ఎస్ఐగా మహేష్ నాయుడు బాధ్యతల స్వీకరణ

Story highlights

  • నందలూరు ఎస్ఐగా మహేష్ నాయుడు బాధ్యతల స్వీకరణ పున్నమి ప్రతినేధి : షేక్ వలీద్ నందలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా మహేష్ నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
  • ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున రెడ్డి ప్రొద్దుటూరు రూరల్కు బదిలీ అయ్యారు.
  • ఆయన స్థానంలో సుండుపల్లి నుంచి మహేష్ నాయుడు నందలూరు పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు.

నందలూరు ఎస్ఐగా మహేష్ నాయుడు బాధ్యతల స్వీకరణ
పున్నమి ప్రతినేధి : షేక్ వలీద్
నందలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా మహేష్ నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున రెడ్డి ప్రొద్దుటూరు రూరల్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సుండుపల్లి నుంచి మహేష్ నాయుడు నందలూరు పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ నాయుడు మాట్లాడుతూ నందలూరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *