Story highlights
- ఆంధ్రప్రదేశ్లోని మసీదుల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న ఇమామ్లు, మౌజన్ల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 9,982 మంది ఆధ్యాత్మిక సేవకులకు మూడు నెలల గౌరవ వేతనం కింద రూ.22.45 కోట్లను ప్రభుత్వం సత్వరమే విడుదల చేసింది.
- ఇందులో 4,991 మంది ఇమామ్లు, 4,991 మంది మౌజన్లు ప్రయోజనం పొందనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని మసీదుల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న ఇమామ్లు, మౌజన్ల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 9,982 మంది ఆధ్యాత్మిక సేవకులకు మూడు నెలల గౌరవ వేతనం కింద రూ.22.45 కోట్లను ప్రభుత్వం సత్వరమే విడుదల చేసింది. ఇందులో 4,991 మంది ఇమామ్లు, 4,991 మంది మౌజన్లు ప్రయోజనం పొందనున్నారు.
మసీదుల్లో రోజువారీ ప్రార్థనా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలు సజావుగా సాగేలా చూడటంలో ఇమామ్లు, మౌజన్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి విశిష్ట సేవలను గుర్తించి గౌరవిస్తూ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నెలకు ఇమామ్లకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున క్రమం తప్పకుండా అందిస్తోంది. గడచిన 27 నెలల్లో ఇప్పటివరకు ఇమామ్లు, మౌజన్లకు మొత్తం రూ.202 కోట్ల భారీ నిధులను గౌరవ వేతనంగా అందించి, మైనారిటీల పట్ల తమకున్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకుంది.
ఈ సంతోషకరమైన సందర్భంలో తెలుగు దేశం పార్టీ ముస్లిమ్ మైనారిటీ యువ నాయకులు పఠాన్ మహర్ ఖాన్ మాట్లాడుతూ…”మాతాపితల లాగా ముస్లిం మైనారిటీల కష్టసుఖాలను సొంత బాధ్యతగా భావించి, ఇచ్చిన మాట ప్రకారం మైనారిటీల సంక్షేమానికి అహరహం శ్రమిస్తున్న విజన్ ఉన్న ప్రజా నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలాగే అణగారిన వర్గాల, మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తూ, కూటమి శ్రేణుల్లో నవ చైతన్యాన్ని రగిలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజా బంధువులు.
మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ ముస్లింల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ప్రగతిశీల నాయకత్వం మన రాష్ట్రానికి దొరకడం మనందరి అదృష్టం. ముస్లిం మైనారిటీలకు కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని హర్షం వ్యక్తం చేశారు.