Story highlights
- నందలూరు మండలంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఎర్రచెరువుపల్లి బూత్ ఇన్‌చార్జి, టీడీపీ యువనాయకుడు గుగ్గిళ్ళ నాగరాజు చురుకుగా పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
- ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాగునీరు, రహదారులు, మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుని నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
- పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి కుటుంబంతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.యువతను సమన్వయం చేస్తూ..బూత్ పరిధిలోని యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకు నాగరాజు కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నందలూరు మండలంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఎర్రచెరువుపల్లి బూత్ ఇన్‌చార్జి, టీడీపీ యువనాయకుడు గుగ్గిళ్ళ నాగరాజు చురుకుగా పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాగునీరు, రహదారులు, మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుని నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి కుటుంబంతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.యువతను సమన్వయం చేస్తూ..బూత్ పరిధిలోని యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకు నాగరాజు కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.రాజంపేట టీడీపీ నాయకత్వం, సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో నందలూరు మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. “ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రతి గడపకు సంక్షేమ పథకాల సమాచారాన్ని తీసుకెళ్లడమే మా లక్ష్యం” అని గుగ్గిళ్ళ నాగరాజు పేర్కొన్నారు.రానున్న రోజుల్లోనూ యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఆయన కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.