నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆధునికరించిన వికలాంగుల దృవపత్రాల జారీ కేంద్రాన్ని (సదరం) సుందరంగా తీర్చిదిద్దడం పట్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే వికలాంగుల ధృవపత్రం జారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇదివరకు ఉన్న వికలాంగుల దృవపత్రం జారీ కేంద్రాన్ని 15 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికరించడం జరిగింది. ఇంకా మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అరుణకుమారి, డిప్యూటీ సూపరిండెంట్ నగేష్ తదితరులు ఉన్నారు.

దృవ పత్రాల జారి కేంద్రాన్ని సందర్శించిన :కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆధునికరించిన వికలాంగుల దృవపత్రాల జారీ కేంద్రాన్ని (సదరం) సుందరంగా తీర్చిదిద్దడం పట్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే వికలాంగుల ధృవపత్రం జారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇదివరకు ఉన్న వికలాంగుల దృవపత్రం జారీ కేంద్రాన్ని 15 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికరించడం జరిగింది. ఇంకా మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అరుణకుమారి, డిప్యూటీ సూపరిండెంట్ నగేష్ తదితరులు ఉన్నారు.

