ధీరవనిత సునీత విలియమ్స్ :యం.వి.చలపతి

0
291

 

సునీత విలియమ్స్ శాస్త్రీయ ధీరవనిత. అంతరిక్షంలో చిక్కుకున్న మహిళ. భూమి మీద నుండి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 8 రోజులలో తిరిగి రావాల్సి ఉండగా అంతరిక్షంలోనే తొమ్మిది నెలల పాటు చిక్కుకొని ధైర్యంగా తాను చేయవలసిన పరిశోధనలు చేసి, ఎట్టకేలకు భూమి మీదకు దిగారు. ఈమె విశ్వనారి .తండ్రి గుజరాతీ భారతీయ మూలాలున్న అమెరికన్ పౌరుడు. తల్లి మధ్య యూరప్ లోని స్లోవీనియా దేశ మూలాలు ఉన్న అమెరికన్ పౌరురాలు.  వీరి ముగ్గురు సంతానంలో చివరి వారు సునీత విలియమ్స్. ఈమె  భర్త మైఖేల్ జె విలియమ్స్ ,అమెరికన్ మార్షల్, హెలికాప్టర్ పైలెట్ . ఈమెకు మనము భావించే జాతీయత ఎల్లలు ఉన్నాయా ?ఎల్లలు లేని అంతర్జాతీయ మహిళ .అంతేకాదు అంతరిక్ష మహిళ కూడా.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమి చుట్టూ 90 నిమిషాలకు ఒకసారి అంటే రోజుకి 16 సార్లు చొప్పున, ఇటీవలి 286 రోజులపాటు ఐఎస్ఎస్ లో ఉన్న కాలంలో 4576 పర్యాయాలు భూమి చుట్టూ ప్రదర్శనం చేశారు .అంటే 12 కోట్ల 10 లక్షల మైళ్ళ ప్రయాణం చేశారు.

ఈమె 68 రోజుల 20 నిమిషాలు అంతరిక్షంలో గడిపింది రెండు పర్యాయాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు కమాండర్ గా వ్యవహరించింది 62 గంటల 6 నిమిషాలు అంతరిక్ష కేంద్రం నుంచి వెలుపలకు వచ్చి స్పేస్ వాక్ చేసిన సాహసి.  నాలుగు  అంతరిక్ష ప్రయాణాలు చేశారు మూడు ముఖ్యమైన మిషన్లలో శాస్త్ర పరిశోధనలు చేశారు.

 

  ఇలా అంతరిక్ష ప్రయాణాలు చేస్తూ, అంతరిక్షంలో ఉండి శాస్త్ర పరిశోధనలు చేయాలంటే విజ్ఞాన శాస్త్రంలో పట్టు ఉండాలి. విజ్ఞాన శాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉండాలి .అలాగే సాంకేతిక నైపుణ్యం లో అపారమైన మెళుకువలుఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది .అంతేగాని కేవలం మొండి ధైర్యం కాదు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇచ్చిన ధైర్యం. అంతేకాదు మానవ శాస్త్రీయ కార్యాచరణ పైన  సునీత విలియమ్స్ కు బుచ్ విల్ మోర్లకు నమ్మకం ఉండబట్టే  వారు ఈ విషయంలో విజయం సాధించారు. సైన్స్ ని నమ్మి సైన్స్ పద్ధతిని ఆచరించి నవారు తప్పక విజయం సాధిస్తారు.అనే సందేశాన్ని సునీత విలియమ్స్ ఆమె సహ అంతరిక్ష నావికుడు ,పరిశోధకుడు అయినా బుచ్ విల్ మోర్ లు చాటిచెప్పారు.

2024లో బోయింగ్ స్టార్ లైనర్ లో వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు ఎనిమిది రోజులకే తిరిగి రావాల్సి ఉండగా సదరు స్టార్లైనర్ లో హీలియం వాయువు లీక్, ప్రొపల్షన్ సిస్టంలో లోపాలు తలెత్తాయి. ఫలితంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వీరిద్దరూ మరో 9 మాసాలు అక్కడే ధైర్యంగా గడిపి పరిశోధనలు చేయవలసి వచ్చింది.

సమస్యలు ఏర్పడ్డాయి .అవి సాదాసీదా సమస్యలు కాదు. జీవన్మరణ సమస్యలు. అంతరిక్ష నావికురాలు కల్పనా చావ్లా దుర్ఘటన కళ్ళ ముందు కదలాడుతున్నా, విజ్ఞాన శాస్త్ర సంకల్పబలం, ఆలంబనతో సశాస్త్రీయయ వైజ్ఞానిక ఆచరణతో పరిష్కరించగలం అని నమ్మి శాస్త్ర సమాజం కృషిచేసి వారిని భూమికి దింపగలిగింది.

         

 సైన్స్ ను నమ్మి ,సైన్స్ పద్ధతిని త్రికరణ శుద్ధిగా ఆచరించి ,సాంకేతికంగా అభివృద్ధిని సాధించి  ,పరిశ్రమిస్తే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. అని మరోసారి రుజువైంది. ఇదే సశాస్త్రీయ మానవ వాదం.  మానవుడు నడక నుండి వాహనాల సాయంతో మొదట, నేల మీద ప్రయాణించే వాహనాలు, నీటి మీద ప్రయాణించే పడవలు ,నౌకలు తదనంతరం గాలిలో ప్రయాణించే విమానాలు, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయాణించే రాకెట్లు, స్పేస్ షటిళ్ళు వచ్చేశాయి.  ఈ అంతరిక్ష వాహనాలతో ప్రయాణించి చంద్రుడు మీద కాలు మోపాడు మానవుడు. 2030 నాటికి అంగారకుడి మీద దిగాలని మానవుడుఉవ్విళ్లూరుతున్నాడు.చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం అని అందరికీ తెలిసిందే. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగపెట్టుకుని మానవుడు కృత్రిమ ఉపగ్రహాలని భూకక్షలోకి ప్రవేశపెటుతున్నాడు.అవి భూమి చుట్టూ ప్రదక్షినం చేస్తూ మానవులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. కొన్ని కృత్రిమ ఉపగ్రహాలు సముద్ర పరిశోధన కోసం, మరి కొన్ని వాతావరణ పరిశోధన కోసం ,మరికొన్ని కమ్యూనికేషన్ సేవల కోసం, ఇంకొన్ని వ్యవసాయానికి మరికొన్ని విపత్తుల నుండి రక్షణ కొరకు, మరికొన్ని అయితే యుద్ధ రంగానికి ఉపయోగపడే దానికోసం కూడా కృత్రిమ ఉపగ్రహాలని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రృత్రిమ ఉపగ్రహాలని భూకక్షలో ప్రవేశపెట్టే దానికి రాకెట్లు స్పేస్ షటిళ్ళను వాహనాలుగా ఉపయోగిస్తారు.

       ఇప్పుడు సునీత విలియమ్స్ మరి కొంతమంది అంతరిక్ష నావికులను అంతరిక్షంలోనికి ఈ రాకెట్లు ,స్పేస్ షటిళ్ళు తీసుకువెళుతున్నాయి. తిరిగితీసుకొని వస్తూన్నాయి. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల కోసం అంతరిక్ష పర్యాటక రంగాన్ని ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ప్రారంభించాడు.

  సునీత విలియమ్స్ విచ్ విల్ మోర్ మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణికులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమి మీదికి తీసుకొచ్చేదానికి ఎలాంటి స్పేస్ ఎక్స్ నాసాతో ఒప్పందం చేసుకొని ఫ్రూట్ డ్రాగన్ వాహక నౌక ద్వారా భూమి మీద తీసుకొచ్చారు.

    సైన్స్ సాంకేతిక రంగాలను మానవులు మానవ కళ్యాణం కోసం అభివృద్ధి పరిచారు. అదే సైన్సును నేటి వ్యాపారులు తమ లాభార్జన కోసం వినియోగించుకుని కొటానుకోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకుంటున్నారు అంతేకాదు రాజకీయాలను కూడా శాసిస్తున్నారు.

 

సైన్స్ తనంత తానుగా మానవ కళ్యాణానికి ప్రస్తుత సామాజిక వ్యవస్థలోఉపయోగపడదు. దాన్ని ఉపయోగించే రాజ్య వ్యవస్థను బట్టి సైన్స్ మానవ వికాసానికా ?లేక వినాశానికా ? అనేది నిర్ణయించబడుతుంది. సైన్సు, సాంకేతిక రంగాలను మార్కెట్ లాభాపేక్ష కోసము కాక మానవాభివృద్ధి కోసం ఉపయోగించే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత సమాజానికున్నది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here