Wednesday, 30 July 2025
  • Home  
  • ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..
- Featured - ఆంధ్రప్రదేశ్

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం….. మర్రిపాడు :   మండల కేంద్రంలో మండల తహసీల్దారు,డివి సుధాకర్,అగ్రికల్చరల్ ఆఫీసర్ .శ్రీదర్ రెడ్డి మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు వారి సమక్షంలోసోసైటీ కార్యాలయంలో ధాన్యం (వరి) కొనుగోలు కేంద్రాన్ని మాజీ సొసైటీ అధ్యక్షులు చిన్నారెడ్డి చేతులు మీదుగా ప్రారబించడం జరిగింది.ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్ధతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైసిపి పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ధాన్యంకొనుగోలుకేంద్రాలుఏర్పాటుచేస్తున్నారన్నారు. గ్రేడ్‌-ఎ క్వింటా ధాన్యానికి రూ.1835, గ్రేడ్‌-ఎ 80 కిలోలు ధాన్యం బస్తాకు రూ.1468, గ్రేడ్‌-ఎ 40 కిలోలు ధాన్యం బస్తాకు రూ.734 మద్దతు ధర గ్రేడ్ ఏ పుట్టి 15,597.50 రూ.,సాదారణ రకం పుట్టి 15,127.50 గా కల్పించిందన్నారు. దళారులు మాటలు విని మోసపోవద్దని, ధాన్యం బస్తాలను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు. ఏవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సోసైటీ కార్యాలయంలో ధాన్యం (వరి) కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు మద్దతు ధరలు 0కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆయన తెలిపారు. దళారీల ప్రమేయంతో రైతులు నష్టపోతున్నారని, కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు కార్యక్రమంలో తహసీల్దారు డి.వి.సుధాకర్,ఏవో శ్రీధర్ రెడ్డి,వైస్సార్సీపీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టరీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

మర్రిపాడు :   మండల కేంద్రంలో మండల తహసీల్దారు,డివి సుధాకర్,అగ్రికల్చరల్ ఆఫీసర్ .శ్రీదర్ రెడ్డి మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు వారి సమక్షంలోసోసైటీ కార్యాలయంలో ధాన్యం (వరి) కొనుగోలు కేంద్రాన్ని మాజీ సొసైటీ అధ్యక్షులు చిన్నారెడ్డి చేతులు మీదుగా ప్రారబించడం జరిగింది.ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్ధతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు
రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైసిపి పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ధాన్యంకొనుగోలుకేంద్రాలుఏర్పాటుచేస్తున్నారన్నారు. గ్రేడ్‌-ఎ క్వింటా ధాన్యానికి రూ.1835, గ్రేడ్‌-ఎ 80 కిలోలు ధాన్యం బస్తాకు రూ.1468, గ్రేడ్‌-ఎ 40 కిలోలు ధాన్యం బస్తాకు రూ.734 మద్దతు ధర
గ్రేడ్ ఏ పుట్టి 15,597.50 రూ.,సాదారణ రకం పుట్టి 15,127.50 గా కల్పించిందన్నారు. దళారులు మాటలు విని మోసపోవద్దని, ధాన్యం బస్తాలను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు.
ఏవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
సోసైటీ కార్యాలయంలో ధాన్యం (వరి) కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు మద్దతు ధరలు 0కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆయన తెలిపారు. దళారీల ప్రమేయంతో రైతులు నష్టపోతున్నారని, కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు
కార్యక్రమంలో తహసీల్దారు డి.వి.సుధాకర్,ఏవో శ్రీధర్ రెడ్డి,వైస్సార్సీపీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టరీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.