“ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త” – ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*
ధవళేశ్వరం MSME పార్కు ప్రాంగణంలో మంగళవారం ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.
“ఈ ప్రాంతంలో ఇప్పటికే 12 పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏర్పడిన విజ్ఞాన కేంద్రం అన్నారు. యువతకు ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చు అన్న నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త అన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో మానవ వనరుల అభివృద్ధికి, యువతకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నవంబర్ 18న నారా లోకేష్ జిల్లాకు రానుండగా, విద్యార్థులు మరియు యువత తమ సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలు తెలియజేసి , ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలోచన చెయ్యడం జరుగుతోందని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అవతరించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది” అని తెలిపారు.
ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) వివరాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడిస్తూ – “Ac.2.00 ఎకరాల్లో ప్రతిపాదిత ఈ ప్రాజెక్టు ద్వారా 26 యూనిట్లు స్థాపించబడతాయన్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 34,444.51 చదరపు అడుగులు కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 5.15 కోట్లుగా ఉందన్నారు. ఇది సూక్ష్మ మరియు చిన్న స్థాయి యూనిట్లకు ‘ప్లగ్ అండ్ ప్లే’ సౌకర్యాలను అందించే ఆధునిక పారిశ్రామిక భవనం అవుతుందన్నారు. తయారీ, అసెంబ్లింగ్, సేవా రంగాల యూనిట్లు ఇక్కడ స్థాపించుకోగలవనీ, తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూపు దిద్దుకుని మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సాధ్యం అవుతుందని తెలిపారు.
శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ – “ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం అన్నారు. యువత పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. అధికారులు కూడా ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నారు” అన్నారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ – “పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉద్యోగావకాశాలు సృష్టించబడు తున్నాయన్నారు. యువత తమ సెల్‌ఫోన్, టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించుకోవాలనీ , సాంకేతిక పరిజ్ఞానం మంచికి, చెడుకి రెండిటికీ వాడవచ్చు అన్నారం కానీ, మేము దీన్ని సృజనాత్మక మార్గంలో ఉపయోగించే యువతను కోరుకుంటున్నాం అని పిలుపు ఇచ్చారు. MSME రంగంలో 15 కోట్ల రూపాయలతో చిన్న, మధ్య తరహా యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్న వారు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ కోరారు. మీ ఆలోచనలను ప్రోత్సహించి, ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందన్నారు. నైపుణ్యం ఉన్న వ్యక్తిని , వాటి నుండి ఎవరూ దూరం చేయలేరు” అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, ఎపిఐఐసి లిమిటెడ్ జోనల్ మేనేజర్ రమణా రెడ్డి, ఎపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, డీఐవో శ్రీవనిధర్ రామన్, ఎంపీపీ (కడియం) వి. ప్రసాద్, ఎంఎస్ఎంఈ చైర్మన్ జార్జీ బాబు, ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మచ్చేటి ప్రసాద్, మజ్జి పద్మావతి, పండూరి అప్పారావు, యానాపు యేసు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పి. అప్పారావు, ఎం. ప్రసాద్, స్థానిక నాయకులు, మరియు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


