ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ శ్రీమతి శ్రీ లత ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ముగ్గుల పోటీలకు డివిజన్‌లోని ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు. పండుగ వాతావరణంలో సామాజిక ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



