Wednesday, 18 February 2026
  • Home  
  • ద్విచక్ర వాహన మెకానికర్ల సంక్షేమానికి కృషి – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
- తూర్పు గోదావరి

ద్విచక్ర వాహన మెకానికర్ల సంక్షేమానికి కృషి – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

350 మంది మెకానిక్ లకు ప్రమాద బీమా బాండ్లు అందచేత రాజమహేంద్రవరం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర మెకానికర్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి వారికి అందించడం జరిగింది. స్థానిక ఆర్టీసి కంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వరి కల్యాణ మండపంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో, టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మాట ఇచ్చాం… నెరవేర్చమన్నారు. తమ కూటమి ప్రభుత్వం అవసరాలు తెలుసుకుని సంక్షేమ పధకాలు అమలు చేస్తోందన్నారు. సూపర్ సిక్స్ లోని దాదాపు అన్నీ పధకాలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు కాస్త ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారి కోసం కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 15000 ఇస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ఆటో కార్మికులకు రూ. 10000 వేలు ఇస్తే తాము రూ. 15000 ఇచ్చామాన్నారు. రూ. 1400 కోట్లతో రోడ్లు బాగుచేసినట్టు తెలిపారు. షరతులతో కూడిన పధకాలు వారివి… హద్దుల్లేని సంక్షేమం మాది అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహకారంతో దాతలు కూడా ముందుకు వచ్చి పేదలను ఆడుకోవాలని పిలుపునిచ్చారు. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులు, క్రీడాకారులకు సహకారం అందించడం, అలాగే నిరుపేదలకు వైద్యం కోసం ఆర్ధికం సహకారం అందిస్తున్నామని తెలిపారు. మెకానిక్ల సంక్షేమం కోసం ప్రమాద బీమా చేయించినట్టు తెలిపారు. అందరి సంక్షేమాన్నే తాము, తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ మెకానిక్ డే రోజున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు… ఇప్పుడు నెరవేర్చారు. భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేకం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతిపక్షంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటి అధికార పార్టీ వైకాపా ప్రజా ప్రతినిధి ఇబ్బందులు పెట్టాడు, ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెస్ట్ లేకుండా పని చేసే ప్రజా నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు. నేనున్నానంటూ తోడుండే నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తారు ఆయన అని అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ , టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా మాట్లాడుతూ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏకైనా నాయకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చర్చ్ లు, మసీదులు, దేవాలయాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం అందరి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టేసింది. మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శంగా మన రాజమండ్రిని నిలిపేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ద్విచక్ర మెకానికర్లు తదితరులు పాల్గొన్నారు.

350 మంది మెకానిక్ లకు ప్రమాద బీమా బాండ్లు అందచేత
రాజమహేంద్రవరం :
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర మెకానికర్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి వారికి అందించడం జరిగింది. స్థానిక ఆర్టీసి కంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వరి కల్యాణ మండపంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో, టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ
మాట ఇచ్చాం… నెరవేర్చమన్నారు. తమ కూటమి ప్రభుత్వం అవసరాలు తెలుసుకుని సంక్షేమ పధకాలు అమలు చేస్తోందన్నారు. సూపర్ సిక్స్ లోని దాదాపు అన్నీ పధకాలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు కాస్త ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారి కోసం కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 15000 ఇస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ఆటో కార్మికులకు రూ. 10000 వేలు ఇస్తే తాము రూ. 15000 ఇచ్చామాన్నారు. రూ. 1400 కోట్లతో రోడ్లు బాగుచేసినట్టు తెలిపారు. షరతులతో కూడిన పధకాలు వారివి… హద్దుల్లేని సంక్షేమం మాది అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహకారంతో దాతలు కూడా ముందుకు వచ్చి పేదలను ఆడుకోవాలని పిలుపునిచ్చారు. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులు, క్రీడాకారులకు సహకారం అందించడం, అలాగే నిరుపేదలకు వైద్యం కోసం ఆర్ధికం సహకారం అందిస్తున్నామని తెలిపారు. మెకానిక్ల సంక్షేమం కోసం ప్రమాద బీమా చేయించినట్టు తెలిపారు. అందరి సంక్షేమాన్నే తాము, తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ మెకానిక్ డే రోజున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు… ఇప్పుడు నెరవేర్చారు. భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేకం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతిపక్షంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటి అధికార పార్టీ వైకాపా ప్రజా ప్రతినిధి ఇబ్బందులు పెట్టాడు, ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెస్ట్ లేకుండా పని చేసే ప్రజా నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు. నేనున్నానంటూ తోడుండే నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తారు ఆయన అని అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ , టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా మాట్లాడుతూ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏకైనా నాయకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చర్చ్ లు, మసీదులు, దేవాలయాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం అందరి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టేసింది. మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శంగా మన రాజమండ్రిని నిలిపేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ద్విచక్ర మెకానికర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.