*ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, వాహన పత్రాలు తప్పనిసరి*
* చిట్వేల్ లో పలు వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ నవీన్*
చిట్వేల్ జూలై 22 ( పున్నమి న్యూస్)
*ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని చిట్వేలి మండల ఎస్సై నవీన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గుంటి శ్రీరాములు అంబేద్కర్ సర్కిల్ నందు ఆయన పలు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ మాట్లాడుతూ టాటా మ్యాక్స్ లు, ఆటోలు, పలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడుపుతున్న డ్రైవర్లు తప్పనిసరిగా కాకి డ్రస్ ధరించాలని, అలాగే వాహనాలకు ఫిట్నెస్ పేపర్లు కరెక్ట్ గా ఉండాలని ఆయన తెలియజేశారు. పలు వాహనాలు తనిఖీ చేసి హెల్మెట్, వాహన పత్రాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి, ఆటోలకు, కాకి డ్రస్ కోడ్ పాటించిన వారికి జరిమానా విధించారు. అలాగే మండలంలో పలుచోట్ల మైనర్ పిల్లలు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ పై మితిమీరిన వేగంతో వెళ్తున్నారని, వేగంతో వెళ్లేటప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వారిని గమనించి పట్టుకున్నప్పుడు మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చిన యజమానులకు, వాహనం తోలిన వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేకపోతే విచ్చలవిడిగా తయారవుతారని ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక, అలాగే సెలవుల్లో ఏం చేస్తున్నారో గమనించి ఏమన్నా తప్పు చేసేటప్పుడు ఇలా చేయకూడదని వారిని మందలిస్తే ఎటువంటి ఇబ్బందులు జరగవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంగార్డులు మోహన్ రాజు, సుధాకర్ నాయుడు, జోరోపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు*


