Thursday, 5 February 2026
  • Home  
  • ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి*
- విశాఖపట్నం

ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి*

*ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి* *విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి* ఉత్తరాంధ్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ 93 వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో జరిగాయి. సిరిపురం జంక్షన్ లో ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి ఆమె పూల మాల వేసి, మూడు రంగుల కండువా కప్పి నివాళులు అర్పించారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాలలో స్వర్గీయ ద్రోణంరాజు చెరగని ముద్ర వేశారని, వుడా చైర్మన్ గా, ఎంపీగా అద్భుతమైన పాలన అందించారని, ఎంవీపీ లాంటి కాలనీ ఆయన హయాంలోనే రూపొందిందని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి, కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం,మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి చాలా ఇష్టమైన నాయకుడని ప్రియాంక తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, డా. విజయ్ చంద్రా, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి, సీనియర్ నాయకులు కస్తూరి వెంకటరావు, సోడాదశి సుధాకర్, ముక్క రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

*ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి*
*విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి*
ఉత్తరాంధ్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ 93 వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో జరిగాయి. సిరిపురం జంక్షన్ లో ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి ఆమె పూల మాల వేసి, మూడు రంగుల కండువా కప్పి నివాళులు అర్పించారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాలలో స్వర్గీయ ద్రోణంరాజు చెరగని ముద్ర వేశారని, వుడా చైర్మన్ గా, ఎంపీగా అద్భుతమైన పాలన అందించారని, ఎంవీపీ లాంటి కాలనీ ఆయన హయాంలోనే రూపొందిందని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి, కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం,మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి చాలా ఇష్టమైన నాయకుడని ప్రియాంక తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, డా. విజయ్ చంద్రా, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి, సీనియర్ నాయకులు కస్తూరి వెంకటరావు, సోడాదశి సుధాకర్, ముక్క రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.