అర్ధరాత్రి దొంగల హల్చల్.. 12 ఇళ్లలో చోరీ ….
తెలంగాణ : హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్లలో దొంగలు హల్చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. చేతిలో కత్తులు పట్టుకుని పరిసరాల్లో కలియతిరిగారు. గత రాత్రి కార్లలో వచ్చి పక్కా ప్లాన్‌తో 12 ఇళ్లలో చోరీ చేసి పరార్ అయ్యారు. బంగారం, నగదుతో పరారైనట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

