రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి న్యూస్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని స్థానిక నరసరావుపేట లో నివసిస్తున్న గంధం చిన్నక్కకు ఆదివారం అనంతరాజంపేట గ్రామ పంచాయతీ తూర్పుపల్లి వాస్తవ్యులు దేసు కృష్ణారెడ్డి జన్మదినోత్సవ పురస్కరించుకొని బోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ గంధం చిన్నక్క గత ఏడు సంవత్సరాలు క్రిందట ప్రమాదంలో భర్త కోల్పోయి నిరాశ్రయులైన ఆమె కు పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో కూలికి పోతే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న స్థితిని గమనించి బోలాశంకర్ సేవాసమితి ఆధ్వర్యంలో నిరాసేన పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు మల్లెల మణి మన దృష్టికి తీసుకురావడం ఈ విషయాన్ని కృష్ణారెడ్డికి తెలపడం అన్న జన్మదిన సందర్భంగా నేను కచ్చితంగా మన సేవా సమితి ద్వారా సహాయ సహకార అందిస్తానని చెప్పడం వెంటనే ఆదివారం నాడు ఆ నిరాశ్రయులైన మహిళకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నందుకు ఆ పరమశివుని ఆశీస్సులు కృష్ణారెడ్డి పై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎవరైనా మన మండల పరిధిలో సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తే మన సేవా సమితి ద్వారా చేయడానికి వీలు కల్పిస్తున్నామని పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బోలాశంకర్ సేవా సమితి సభ్యులు చెన్నం శెట్టి రమేష్, ఉత్తరాది శివకుమార్, పోలశెట్టి రాజేశ్వరమ్మ,, వాసా బాబు, కొప్పాల శంకరయ్య, పెనుకొండ సుబ్బరాయుడు, కొర్లకుంట శంకర, బైసాని కిరణ్, శేఖర్, సందాని, కిన్నెర శివ, వెంకటకృష్ణ మరియు స్థానికులు పాల్గొన్నారు.


