Thursday, 5 February 2026
  • Home  
  • దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం
- విశాఖపట్నం

దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం

*దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం* *విశ్వఖ్యాతివారధులు కళాకారులు* *పశ్చిమ బెంగాల్ కళాకారులకు కళాజీవ పురస్కారాల ప్రధానం* నగర పోలీస్ కమిషనర్ సంఖ బ్రత బాగ్చి *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మన దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయమైనదని నగర పోలీస్ కమిషనర్ సంఖ భ్రత బాగ్చి పేర్కొన్నారు. సోమవారం సీతమ్మధార ఏపీ ఎస్ ఈ బి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో స్కూల్ ఆఫ్ థియేటర్స్, ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ కళాకారుల సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారుల ప్రతిభకు ఎల్లలు ఉండవన్నారు. విశ్వ సమైక్యతకు కళాకారులే వారధులు అని పేర్కొన్నారు.మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ జానపద కళారూపాలను పరిరక్షించుకునే బాధ్యత అందరిదీ అన్నారు. బా జాపా మహిళా నాయకురాలు బాగాది శ్యామల మన సాంప్రదాయ కళలు విశ్వ ఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు. ఇంటర్నేషనల్ వాకర్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కమల్ బెయిడ్ మాట్లాడుతూ విశాఖలో క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభావంతులకు కొదవ లేదన్నారు.విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ విశాఖలో సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రభుత్వ వేదిక అవసరం ఉందన్నారు.దేశంలోని బహు భాషా నృత్య కళాకారులను విశాఖపట్నం తీసుకు వఛ్చి ఇక్కడి కళాభిమానులు విభిన్న నృత్య రీతులను చూసే అవకాశాన్ని కల్పిస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వహకులను అభినందించారు. బ్రహ్మ కుమారి రామేశ్వరి స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ విశాఖలో విభిన్న దేశాల జానపద నృత్య సమ్మేళనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్, విశాఖపట్నం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను సత్కరించారు.కార్యక్రమంలో కొండ్రు రామారావు బి. గురునాధరావు, బాగాది శ్యామల ప్రవల్లిక నాయుడు, కుమారి తదితరులు పాల్గున్నారు. అనంతరం వెస్ట్ బెంగాల్, విశాఖ కళాకారుల జానపద నృత్యాలు ప్రదర్శించారు.

*దేశ సాంస్కృతిక సంపద ఆదర్శనీయం*

*విశ్వఖ్యాతివారధులు కళాకారులు*

*పశ్చిమ బెంగాల్ కళాకారులకు కళాజీవ పురస్కారాల ప్రధానం*

నగర పోలీస్ కమిషనర్ సంఖ బ్రత బాగ్చి
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*

మన దేశ సాంస్కృతిక
సంపద ఆదర్శనీయమైనదని నగర పోలీస్ కమిషనర్ సంఖ భ్రత బాగ్చి పేర్కొన్నారు. సోమవారం సీతమ్మధార ఏపీ ఎస్ ఈ బి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో స్కూల్ ఆఫ్ థియేటర్స్, ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ కళాకారుల సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారుల ప్రతిభకు ఎల్లలు ఉండవన్నారు. విశ్వ సమైక్యతకు కళాకారులే వారధులు అని పేర్కొన్నారు.మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ జానపద కళారూపాలను పరిరక్షించుకునే బాధ్యత అందరిదీ అన్నారు. బా జాపా మహిళా నాయకురాలు బాగాది శ్యామల మన సాంప్రదాయ కళలు విశ్వ ఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు. ఇంటర్నేషనల్ వాకర్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కమల్ బెయిడ్ మాట్లాడుతూ విశాఖలో క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభావంతులకు కొదవ లేదన్నారు.విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ విశాఖలో సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రభుత్వ వేదిక అవసరం ఉందన్నారు.దేశంలోని బహు భాషా నృత్య కళాకారులను విశాఖపట్నం తీసుకు వఛ్చి ఇక్కడి కళాభిమానులు విభిన్న నృత్య రీతులను చూసే అవకాశాన్ని కల్పిస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వహకులను అభినందించారు. బ్రహ్మ కుమారి రామేశ్వరి స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ విశాఖలో విభిన్న దేశాల జానపద నృత్య సమ్మేళనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్, విశాఖపట్నం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను సత్కరించారు.కార్యక్రమంలో కొండ్రు రామారావు బి. గురునాధరావు, బాగాది శ్యామల ప్రవల్లిక నాయుడు, కుమారి తదితరులు పాల్గున్నారు. అనంతరం వెస్ట్ బెంగాల్, విశాఖ కళాకారుల జానపద నృత్యాలు ప్రదర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.